Anita Włodarczyk wins Hatrick Olympic Gold అనితా వొడార్సిక్‌ ఘనత: వరుసగా మూడు ఒలంపిక్స్ లో గోల్డ్

Anita wlodarczyk wins third straight hammer gold medal

Anita Wlodarczyk, Olympic gold, hammer throw, Poland, Malwina Kopron, Wang Zheng, United States, DeAnna Price, Tokyo 2020 Olympic Games, Olympic Stadium, Bianca Florentina Ghelber

Anita Włodarczyk sealed her position as the greatest female hammer thrower of all-time after claiming the third consecutive Olympic title of her career. A fourth-round effort of 78.48m was enough to give her victory over the 77.03m of China’s Zheng Wang.

అనితా వొడార్సిక్‌ ఘనత: వరుసగా మూడు ఒలంపిక్స్ లో గోల్డ్

Posted: 08/04/2021 11:26 AM IST
Anita wlodarczyk wins third straight hammer gold medal

ఒలింపిక్ క్రీడాల్లో ఆడటానికి అర్హత సాధించటం ఓ ఘనత అయితే ప్రతిభ చాటి పతకం గెలవటం మరో ఘనత. ఈ ఘనతను సాధించేందుకు క్రీడాకారులు అనునిత్యం ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలో స్వర్ణపతకం గెలవటం అంటే అదొక చరిత్ర అనే చెప్పాలి. తమ దేశ ప్రతిష్టను వారు నలుదిశలా ఇమడనింపజేసే కర్తవ్యాన్ని సాధించినట్టే. అటువంటిది వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనటమే కాకుండా 3 ఒలింపిక్స్ లోను 3 స్వర్ణ పతకాలు సాధిస్తే ఆ క్రీడలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం.

అటువంటి అరుదైన అద్భుతమైన చరిత్రను సృష్టించిందో ఓ మహిళా అథ్లెట్. ఆమే ద గ్రేట్ అథ్లెట్ పోలాండ్‌ ‘అనితా వొడార్జిక్‌’. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనటమే కాకుండా మూడింటిలోను మూడు బంగారు పతకాలను ఎగరేసుకుపోయింది అనితా వొడార్జిక్. ఆమె చరిత్రలో భాగంగా టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటింది అనిత వొడార్జిక్. మంగళవారం జరిగిన హ్యామర్‌ త్రో ఈవెంట్‌లో అనితా హ్యామర్‌ను 78.48 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని కౌవసరం చేసుకుంది.

దీంతో ఒలింపిక్స్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో వరుసగా మూడు పసిడి పతకాలు గెల్చుకున్న తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. లండన్‌, రియో, తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ గెలిచి ఈ ఫీట్‌ సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో అంటే 2012, 2016, 2020 స్వర్ణ పతకం గెలిచి పోలాండ్‌ క్రీడాకారిణి తన రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టే అవకాశం కూడా లేకుండా అనితా వొడార్జిక్‌ అరుదైన ఘనత సాధించింది. పైగా 35 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించటం అంటే మాటలు కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anita Wlodarczyk  gold Medal  Poland  third straight hammer  Hatrick Gold medal  Tokyo Olympics  

Other Articles