Deepika Kumari becomes world no. 1 archer ఆర్చరీ వరల్డ్ కప్: నెంబర్ వన్ దీపికా కుమారి

Archer deepika kumari becomes world no 1 after winning gold at world cup

Sports Authority of India, Deepika Kumari, World No. 1 Archer, World's best Archer, India's best Archer, Archery rankings, Hatrick Goldmedal, World Archery, Archery world cup, Sports Authority of India tweets, World Archery, sports news, sports

Sports Authority of India (SAI) congratulated India's ace archer Deepika Kumari on Monday for regaining the World No. 1 ranking in women's individual recurve as World Archery unveiled its latest rankings.

ఆర్చరీ వరల్డ్ కప్: నెంబర్ వన్ గా నిలిచిన దీపికా కుమారి

Posted: 06/28/2021 07:39 PM IST
Archer deepika kumari becomes world no 1 after winning gold at world cup

స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో మరోసారి గోల్డ్ సాధించింది. ఆర్చరీ వరల్డ్ కప్ లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆమె మూడో సారి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. దీంతో వరల్డ్ ఆర్చరీలో తన నెంబర్ వన్ స్థానాన్ని పథిలం చేసుకుంది. గతంలోనూ ఈ స్థానంలోనే కొనసాగిన దీపిక.. ఆర్చరీ వరల్డ్ కప్ లో స్వర్ణ పతకంతో మరోమారు ఈ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్ స్పోర్ట్స్ అథారిటీ (శాయ్) ఆమెకు అభినందనలు తెలిపింది.

మరోమారు అర్చరీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దీపికకు మరిన్ని విజయాలు అందుకోవాలని అకాంక్షించింది. కాగా మరో నెలలో టోక్యో ఒలింపిక్స్ ఉందనగా ఇటువంటి ఫీట్ సాధించడం అమెకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కల్పించనుందని శాయ్ ధీమాను వ్యక్తం చేసింది. వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న కొరియాతో పోటి పడిన ఇండియాకు కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించింది. కాకపోతే మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లో దీపికా ఒకొక్కరితో ధీటుగా రాణించింది. ఐదు గంటలలోపే బ్యాక్ టూ బ్యాక్ నాలుగు మ్యాచ్ లు ఆడి ప్రత్యర్థులకు చెమటలు పుట్టించింది.

అప్పటికే ఉమెన్స్ సింగిల్స్ తో పాటు మిక్సడ్ టీమ్ లోనూ స్వర్ణ పతకాలు సాధించిన అమెకు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణ పతకం. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రపంచ కప్ లో తాను స్వర్ణం సాధించడం సంతోషంగా వుందని అన్నారు. అయితే అదే సమయంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాలని.. మరో నెల రోజుల వ్యవధిలో రానున్న టోక్యో ఒలంపిక్స్ తమకు అత్యంత ప్రాథాన్యమైనవని అన్నారు. అందులోనూ తన ప్రదర్శన ఇదే స్థాయిలో కొనసాగాలని.. మరింత మెరుగవ్వాలని అందుకు తాను కష్టపడుతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles