Sushil Kumar associates held by Delhi Police జూనియర్ రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ 4 మిత్రుల అరెస్టు

Four associates of wrestler sushil kumar arrested by delhi police

sushil kumar, sagar dhankar murder case, sushil kumar wrestling, sushil kumar railways, sushil kumar arrest, Junior wrestler, sagar dhankar, Murder, Northern railway, sushil kumar suspension, Chhatrasal Stadium, Ajay, Delhi's Mundra area, sports news, sports, wrestling news, wrestling

Delhi Police has arrested four associates of wrestler Sushil Kumar from the Kanjhawala area of the national capital in connection with the alleged murder of wrestler Sagar Dhankar. According to Delhi Police, all were found to be the associates of Sushil Kumar, who has been arrested in the Sagar Dhankar murder case.

జూనియర్ రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ 4 మిత్రుల అరెస్టు

Posted: 05/26/2021 01:35 PM IST
Four associates of wrestler sushil kumar arrested by delhi police

జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ కర్ రాణా హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రిమాండులో వున్న రెజ్లర్ సుశీల్ కుమార్ నలుగురు మిత్రలను పోలీసులు అరెస్టు చేశారు. సాగర్ రాణా హత్యకేసులో వీరి పాత్ర కూడా వుందని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరందరినీ ఢిల్లీలోని ఖంఝవాలా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భూపేందర్ అలియాస్ భూపీ, మొహిత్ అలియాస్ భోలి, గులాబ్ అలియాస్ ఫహిల్వాన్, మజీత్ అలియాస్ చున్నీల్ లాల్ గా గుర్తించారు. వీరంతా హర్యానాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ కుమార్ కు సహకరించిన ఈ నలుగురు కాలా అసుదా- నీరజ్ భవానా గ్యాంగ్ యాక్టివ్ సభ్యులని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగస్టర్ల ప్రమేయం వున్నట్లు సమాచారం అందడంతో హర్యానాలోని రోహిణి జిల్లాలోని గేవ్ర రైల్వే క్రాసింగ్ వద్ద తమ స్పెషల్ పోలీసుల బృందం నిఘా పెట్టిందని, వారిని ఓ రహస్య ఇన్ ఫార్మర్ తో గుర్తించిన వెంటనే అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిపై పలు కేసుల్లో నాన్ బెయిలెబుల్ వారెంట్లు కూడా వున్నాయన్నారు.

అయితే వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో వున్న కుట్రకోణం మొత్తం బట్టబయలు అయ్యిందని తెలిపారు. అసలేం జరిగింది.. హత్యకు దారి తీసిన కారణాలేంటి అన్న విషయాలు వరుస క్రమంలో వారు తెలిపారని పోలీసులు చెప్పారు. మే 4వ తేదిన ఛత్త్రాసాల్ స్టేడియంలో జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు చెప్పారని, అంతేకాకుండా సాగర్ రాణా హత్యకేసులో నిమగ్నమైన ఇతర వ్యక్తుల పేర్లను కూడా వెల్లడించారని పోలీసులు తెలిపారు. చత్త్రాసాల్ స్టేడియంలో రెజర్ల మధ్య ఘర్షణ జరిగిందని, పలువురికి గాయాలయ్యాయని అందులో ఒకరు చికిత్స పోందుతూ మరణించారని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా, రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదని, వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం లేదని.. పోలీసులు పదేపదే అడిగినా పెదవి విప్పడం లేదని సమాచారం. గ్యాంగ్ స్టర్లతో ఆయనకున్న సంబంధాల కోణంలోనూ సుశీల్ పై విచారణ సాగుతోంది. న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల కస్టడీని వినియోగించుకోవాలని పోలీసుల ప్రయత్నాలకు సుశీల్ మౌనం అటంకంగా మారినట్లు తెలుస్తోంది. కాగా సుశీల్ కుమార్ సోమవారం రాత్రంతా విలపిస్తూనే వున్నాడని, బోజనం కూడా చేయలేదు. అయితే క్రితం రోజు మాత్రం ఘటనస్థలికి తీసుకెళ్లి ఘర్షణకు దారి తీసిన వివరాలను పరిశీలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles