World Archery Youth C'ship: India bags 3 medals వరల్డ్ అర్చరీలో భారత జోడికి స్వర్ణం..

India win recurve mixed team gold at world archery

Jemson Ningthoujam, Ankita Bhakat, Archery, gold medal, quarter-finals, Shukmani Gajanan Babrekar, Atul Verma, Deepika Kumari, Palton Hansda, archery, archery news, latest sports news, sports news, latest news

India’s Jemson Ningthoujam and Ankita Bhakat won the mixed team gold medal in the Archery youth championships in Rosario. The pair, who were seeded ninth, beat Russia 6-2 in the final.

వరల్డ్ అర్చరీలో భారత జోడికి స్వర్ణం.. అర్చరీ టైటిల్..

Posted: 10/09/2017 08:19 PM IST
India win recurve mixed team gold at world archery

ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ లో భారత జోడి స్వర్ణంతో మెరిసింది. జెమ్సన్ నింగ్ తోజమ్-అంకితా భకత్ ల జోడి మిక్స్ డ్ డబుల్స్ విభాగంతో అత్తుత్తమంగా రాణించి.. టైటిల్ ను దక్కించుకుంది. దీంతో ఈ జోడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన భారత్ ఈ పతకంతో మొత్తంగా మూడు పతకాలు అందుకుంది. అంతకుముందు రజత, కాంస్య పతకాలను భారత్ సాధించగా, ఆపై నింగ్ తోజమ్-అంకితా భకత్ ల ద్వయం పసిడిని సాధించడంతో అభిమానుల్లో హర్షం వ్యక్తమైంది.

దీపికా కుమారి 2009, 2011లలో రెండు పర్యాయాలు ఇదే యూత్ ఛాంఫియన్ షిఫ్ పోటీలలో పతకాలను సాధించిన తరువాత మళ్లీ ఆ ఘనతను ఆరేళ్ల తరువాత భారత్ అందుకోవడం ఇదే ప్రథమం. పసిడి కోసం జరిగిన తుదిపోరులో తొమ్మిదో సిడ్ లో వున్న భారత జోడీ జెమ్సన్ నింగ్ తోజమ్-అంకితా భకత్ లు 6-2 తేడాతో రష్యా జోడిపై ఏకపక్ష విజయాన్ని సాధించి సత్తాచాటారు.

అంతకుముందు పురుషుల ఈవెంట్ లో భాగంగా ఫైనల్లో నింగ్ తోజమ్ రన్నరప్ గా సరిపెట్టుకుని రజతకాన్ని సాధించాడు. దాంతో యూత్ చాంపియన్ షిప్ లో సాధించిన పతకాలు రెండు కాగా, క్యాడెట్ మహిళల ఈవెంట్ ప్లే ఆఫ్ లో ఖుష్బే దయాల్, సంచితా తివారీలు కాంస్యాన్ని సాధించారు. ఇదిలా ఉంచితే, ఓవరాల్ గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత్ కు ఇది నాల్గో టైటిల్. గతంలో దీపికా కుమారి రెండు సార్లు విజేతగా నిలవగా, 2006లో పాల్టన్ హాన్సదా వరల్డ్ ఆర్చరీ టైటిల్ ను సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jemson Ningthoujam  Ankita Bhakat  gold medal  Shukmani Gajanan Babrekar  Atul Verma  sports  archery  

Other Articles