Sindhu Advances In Asia Championships ఆసియా ఛాంపియర్ షిప్ క్వార్టర్స్ లోకి సింధూ

Pv sindhu reaches asia championships quarter finals

PV Sindhu, Badminton Asia Championships, Aya Ohori, Saina Nehwal, Sikki Reddy, Pranaav Jerry Chopra

PV Sindhu, the Rio Olympics silver medallist, beat Japan’s Aya Ohori in straight games 21-14, 21-15 to advance in the Badminton Asia Championships

ఆసియా ఛాంపియర్ షిప్ క్వార్టర్స్ లోకి సింధూ

Posted: 04/27/2017 06:57 PM IST
Pv sindhu reaches asia championships quarter finals

ఆసియా ఛాంపియన్ షిప్ లో ప్రపంచ మూడవ ర్యాంకర్, తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్లో జపాన్‌ క్రీడాకారిణి అయా ఓహ్రిపై 21-14, 21-15తేడాతో సింధు విజయం సాధించింది. రెండు సెట్లలో ప్రత్యర్థి ఓహ్రిని కొలుకోనీయకుండా తన అద్బుత పోరాట పటిమను ప్రదర్శించింది. సుమారు 40నిమిషాల వ్యవధిలోనే సింధు ప్రత్యర్థిపై రెండు వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్ లో గెలుపోంది క్వార్టర్ ఫైనల్స్ కు పయనించింది. క్వార్టర్స్‌లో సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌జియోతో తలపడనుంది.

ఛాంపియన్ షిప్ లో తొలి రౌండ్ నుంచి తన జైత్రయాత్రను కోనసాగిస్తూ వస్తున్న సింధూ.. తొలిరౌండ్ లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన దినార్ దయా అస్టిన్ ను 218, 2118లతో చిత్తుగా ఓడించి రెండో రౌండ్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తొలిరౌండ్ లో పరాజయాన్ని అందుకున్న మరో భారత షెట్లర్ సైనా నెహ్వాల్ వెనుదిరింగింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత పోరు కూడా ముగిసింది. చైనీస్‌ తైపీ క్రీడాకారుడు సు జెన్‌తో తలపడిన అజయ్‌ జయరాం 19-21, 10-21తేడాతో ఓటమి చవిచూశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles