హాంకాంగ్ ఓపెన్: సెమీస్ లోకి సింధు.. సైనాకు నిరాశ PV Sindhu enter Hong Kong Open badminton semis, saina nehwal out

Pv sindhu enter hong kong open badminton semis saina nehwal out

PV Sindhu enter Hong Kong Open semis, Saina out of Hong Kong Open, Saina Nehwal, PV Sindhu, Hong Kong Open Badminton, Badminton, BWF Super Series

PV Sindhu has entered the semi final of the Kong Kong Open badminton championship on Friday. The Olympic silver medallist faced a tough challenge in scripting a 21-17, 21-23, 21-18 win in one hour and 19 minutes.

హాంకాంగ్ ఓపెన్: సెమీస్ లోకి సింధు.. సైనాకు నిరాశ

Posted: 11/25/2016 06:30 PM IST
Pv sindhu enter hong kong open badminton semis saina nehwal out

రియో ఒలంపిక్స్ రజత పతక విజేత పివీ సింధూ బాడ్మింటన్ లో తన జోరును కోనసాగిస్తుంది. చైనా బాడ్మింటన్ ఓపెన్ టైటిల్ ను సాధించిన సింధూ.. అదే దూకుడును కనబరుస్తూ.. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్ కు చేరింది. వరుసగా మూడు విజయాన్ని నమోదు చేసి సెమీస్ లోకి చేరింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

ఆ గేమ్లో తన ప్రత్యర్థిపై గెలుపుకు చాలా శ్రమించాల్సి వచ్చిన సింధూ.. లియాంగ్ తో తొలి గేమ్ లో గెలుపోందినా.. రెండో గేమ్ లో నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. అయితే లియాంగ్ పై ఈ సెట్ లో పైచేయి కనబర్చింది. దీంతో గెలుపుకు కీలకమైన మూడవ సెట్ లో సింధూ లియాంగ్ ను చిత్తు చేసి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై సింధూ జయకేతనం ఎగురవేసింది.

కాగా మరో హైదరాబాదీ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్.. క్వార్టర్ ఫైనల్స్ లో పరాజయం పాలైంది. హాంకాంగ్‌ క్రీడాకారిణి చెవాంగ్‌ నాన్‌తో క్వార్టర్స్ లో తలపడిన సైనా.. మ్యాచ్ అద్యంతం తన ప్రతిభ ను చాటుకోలేకపోయింది. చెవాంగ్ నాన్ తో తలపడిన క్వార్టర్స్ లో తొలి సెట్ లో చేతులెత్తేసింది. రెండో సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. రెండో సెట్ సైనా పైచేయి సాధించింది. కీలకమైన మూడో సెట్ లో సైనా గెలుపుకు శ్రమించినా.. చెవాంగ్ నాన్ ను రెండు పాయింట్ల తేడాతో విజయం వరించింది. దీంతో సైనా హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  PV Sindhu  Hong Kong Open Badminton  Badminton  BWF Super Series  

Other Articles