టైటిల్ కు అడుగు దూరంలో నిలిచిన ‘సింధూ’రం PV Sindhu registers come-from-behind win to oust Sung Ji Hyun

Pv sindhu registers come from behind win to oust sung ji hyun

Badminton, China Open, China Super Series, India, PV Sindhu, Sun Yu, Sung Ji Hyun

Rio Olympics silver medallist PV Sindhu has advanced to the semifinal of the Thiahot China Open Super Series tournament in Fuzhao.

టైటిల్ కు అడుగు దూరంలో నిలిచిన ‘సింధూ’రం

Posted: 11/19/2016 06:07 PM IST
Pv sindhu registers come from behind win to oust sung ji hyun

భారత స్టార్‌ షట్లర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు మరో సంచలన విజయానికి అమడ దూరంలో నిలిచింది. చైనా ఓపెన్‌ సూపర్ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తన సత్తాను చాటుకుంటూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది.

తొలి రౌండ్ నుంచి తన అత్యుత్తమ ప్రతిభను చాటుకుంటూ దూసుకెళ్లిన హైదరాబాదీ సింధూ.. ప్రస్తుతం ఈ ఈవెంట్‌లో ఫైనల్లో ప్రవేశించింది. హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఏడో సీడ్‌ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్‌ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. రేపు (అదివారం) జరిగే ఫైనల్లో సున్‌ యుతో తలపడనుంది.

సెమీస్‌ పోరులో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్‌ ఆరంభంలో సుంగ్‌ను నిలువరించడంలో విఫలమైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన చివరి రెండు గేమ్‌లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  China Open  China Super Series  India  PV Sindhu  Sun Yu  Sung Ji Hyun  

Other Articles