Politics to Puma, Usain Bolt considers his options

Politics to puma usain bolt considers his options

usain bolt, Jamaican Prime Minister Andrew Holness, usain bolt triple triple, usain bolt gold, usain bolt rio records, usain bolt olympic records, usain bolt rio, usain bolt retirement, puma, politics, rio 2016 olympics, rio, olympics

German sportswear firm Puma hopes to lure Usain Bolt into a job, Chief Executive Bjorn Gulden told reporters just before the Games.

అథ్లెటిక్స్ తరువాత రెండో కెరీర్ పై బోల్ట్ దృష్టి

Posted: 08/20/2016 06:58 PM IST
Politics to puma usain bolt considers his options

తన ఒలింపిక్స్ కెరీర్ను దిగ్విజయంగా ముగించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు బ్రహ్మాండమైన అఫర్ తలుపు తట్టింది. తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. పరుగులో మెరుపు వేగంతో పరిగెత్తే బోల్ట్ ఇక అమాత్యునిగా కూడా తన శాఖను అంతే వేగంగా కొనసాగించనున్నాడు. ఇంతకీ రెండో ఇన్నింగ్ ఏంటి, అమాత్యుడేంటి, అసలు విషయమేంటని అలోచిస్తున్నారా..? పరుగుకు స్వస్తి పలికిన  బోల్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ నుంచి ఓ సందేశం బోల్ట్ కు చేరింది. ఇప్పటికే తమ కీర్తిని ఎంతో ఉన్నతిలో నిలబెట్టిన బోల్ట్కు రాజకీయ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఆయన సంకేతాలు పంపారు.

'బోల్ట్ ప్రదర్శనతో జమైకాకు చాలా లాభం చేకూరింది. ఎన్నో ఘనతలను సాధించిన బోల్ట్ పేరును ఉపయోగించుకోవడం మాకు చాలా ముఖ్యం. అందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి' అని బీబీసీకి  ఇచ్చిన ఇంటర్యూలో హాలెన్స్ పేర్కొన్నారు. అతను ఒకవేళ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు. ఆదివారం 30వ బర్త్ డే చేసుకుంటున్న బోల్ట్..తన రెండో ఇన్నింగ్స్పై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జమైకా ప్రజల కోరిక మేరకు బోల్ట్ రాజకీయ ప్రవేశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బోల్ట్ రాజకీయ ప్రవేశం జరిగితే ఆ ఘనత సాధించిన తొలి ఒలింపియన్ గా బోల్ట్ నిలిచిపోతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sprinter  Usain Bolt  rio  politics  Jamaica  minister  Andrew Holness  Rio olympics 2016  

Other Articles