Sania Mirza-Rohan Bopanna have medal in their sights

Mirza bopanna a win away from a medal

sania mirza, sania mirza rohan bopanna, sania bopanna, mixed doubes tennis, rio olympics, rio 2016, olympics, sports

Sania Mirza and Rohan Bopanna stare at history as they are a win away from a medal in mixed doubles.

రియోలో పతకంపైనా సానియా-బొపన్నా జోడి దృష్టి

Posted: 08/14/2016 01:34 PM IST
Mirza bopanna a win away from a medal

భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో మిశ్రమ ఫలితం వచ్చింది. మహిళల డబుల్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న భారత ష్టార్ షెట్లర్ సానియా మిర్జా, రోహన్ బోపన్నతో కలసి మిక్సడ్ డబుల్స్ లో సెమీస్ లోకి చేరింది. కాగా ఇవాళ తెల్లవారు జామున జరిగిన తొలి సెమీస్ పోరులో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం చేతిలో సానియా, బోపన్న జోడి 2-6, 6-2, 10-3 (టై బ్రేక్) తేడాతో ఓటమి చెందింది. తొలి సెట్ ను సునాయాసంగా సొంతం చేసుకున్న సానియా-బోపన్న జోడీ రెండో రౌండ్ నుంచి తడబాటుకు గురైంది.

దీంతో ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గిన అనుభవమున్న వీనస్ తన జోడీతో కలిసి చెలరేగిపోయింది. బోపన్న మీడియాతో మాట్లాడుతూ.. తొలి సెట్ కోల్పోయినా వీనస్ జోడీ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. ఈ క్రెడిట్ అంతా వీనస్ కే చెందుతుందన్నాడు. ముఖ్యంగా వీనస్ సర్వీస్ తమను ఇబ్బంది పెట్టిందని బోపన్న పేర్కొన్నాడు. ఓటమి నుంచి త్వరగా కోలుకుని కాంస్య పతకం నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు.

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మాట్లాడుతూ.. ఈ ఓటమి నుంచి కోలుకుని బరిలో దిగడం చాలెంజింగ్ గా ఉంటుందని పేర్కొంది. అయితే సాధ్యమైనంత త్వరగా మానసికంగా, శారీరకంగానూ కోలుకుని మరుసటి మ్యాచ్కు సిద్థంగా ఉంటామని చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మొదట స్కోరు చేసిన విషయాలు గుర్తించి, ఎక్కడెక్కడ పాయింట్లు కోల్పోయాయో వాటిని సరిదిద్దుకోవాలని అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Sania Mirza  Rohan Bopanna  mixed doubles  Medals  

Other Articles