Simone Manuel and Penny Oleksiak share Olympic gold in Rio

Simone manuel and penny oleksiak share olympic gold in rio

Rio 2016, Olympic Games, Swimming, Sport, Simone Manuel, Penny Oleksiak, America, Canada, 100m freestyle swimming, gold medals, sports, sports news

American Simone Manuel and Penny Oleksiak from Canada share the Olympic gold medal in the 100m freestyle in Rio. Both record the exact same time of 52.70.

రియో ఒలంపిక్స్: స్విమ్మింగ్ లో అరుదైన ఘటన

Posted: 08/13/2016 01:03 PM IST
Simone manuel and penny oleksiak share olympic gold in rio

రియో ఒలింపిక్స్‌లో అత్యంత అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పోటీలో ఒకరికే దక్కాల్సిన పతకాన్ని ఇద్దరు క్రీడాకారులకు అందించి అరుదైన సంఘటనకు అధికారులు తెరతీసారు. అదేంటి తొలి స్థానంలో నిలిచిన ఒక్కరినే కదా విజయం వరించేది. అయితే ఇద్దరు ప్లేయర్స్ కు స్వర్ణాలు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా... మీరే కాదు ప్రత్యక్షంగా రియోలో ఈ ఈవెంట్ చూసిన వారు ఇంతకంటే ఎక్కువ షాకయ్యారు. అసలు ఈ సంఘటనకు దారితీసిన కారణాలు ఏంటో తెలుసుకోవాలని వుందా..?

మహిళల స్విమ్మింగ్‌ 100 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో అమెరికా స్విమ్మర్‌ సిమోన్ మాన్యుయెల్‌, కెనడా స్విమ్మర్‌ పెన్నీ ఒలెక్సియాక్ స్వర్ణ పతకాలు సాధించారు. ఇద్దరు మహిళా స్మిమ్మర్లు సరిగ్గా 52.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో అధికారులు ఒకటికి రెండుసార్లు రీప్లే చూసి ఇద్దరినీ విజేతలుగా ప్రకటించేశారు.  గతంలో ఉన్న రికార్డును వీరు బద్దలు కొట్టడంతో ఈ స్విమ్మర్లు సరికొత్త రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.

మూడో స్థానంలో నిలిచిన స్వీడన్‌ స్విమ్మర్‌ సారాకు కాంస్యంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్ చరిత్రలో స్విమ్మింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి నల్లజాతి మహిళగా సిమోన్ మాన్యుయెల్ నిలిచింది. వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి ఆఫ్రో-ఆమెరికన్ గానూ మరో రికార్డు అమెరికన్ స్విమ్మర్ నమోదు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Simone Manuel  Penny Oleksiak  swimming  Gold Medals  

Other Articles