Jwala-Ashwini, Srikanth advance in Badminton World Championships

Jwala ashwini srikanth reach world badminton quarters

badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal,, Li Xuerui, gutta jwala, ashwini, kashyap, pranay, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Women’s doubles pair of Jwala Gutta and Ashwini Ponnappa mooved into the quarterfinals of the Badminton World Championships after beating Reika Kakiiwa and Miyuki Maeda of Japan 21-15 18-21 21-19 in the third round on Thursday.

క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన జ్వాలా, అశ్వనీ జోడి

Posted: 08/13/2015 06:05 PM IST
Jwala ashwini srikanth reach world badminton quarters

హైదరాబాదీ షెట్లర్లు, తెలుగు తేజాలు జకార్తలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే  సైనా నెహ్వాల్, పీవీ సింధూలు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, ఆ దారిలోనే మహిళల డబుల్స్ జోడీ కూడా పయనిస్తోంది. ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గుత్తా జ్వాల, అశ్వినీ పోన్నప్ప జోడీ కూడా క్వార్టర్ ఫైనల్స్ లో కి దూసుకెళ్లింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో 13వ సీడ్‌ జ్వాల-అశ్విన్‌ జోడీ 21-10, 21-18తో వరుస గేముల్లో హిషి పె చెన్‌-యు టి జంగ్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై సులువుగా గెలిచిన అనంతరం ఇవాళ జరిగిన మ్యాచ్లో ఎనమిదవ సీడ్ కు చెందిన జపానీస్ జోడి రైకా కాక్కివా, మియుకీ మైడలపై 1-15 18-21 21-19 తేడాతో జ్వాల జోడి విజయం సాధించారు.

అటు పురుషుల సింగిల్స్‌లోనూ మూడో సీడ్‌ శ్రీకాంత్‌ వరుస గేముల్లో దూసుకెళ్తున్నాడు. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్‌లో తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. బుధవారం రెండో రౌండ్‌లో అతను చైనీస్ తైపీ ఆటగాడు సు జెన్ హవోను 21-14, 21-15 తేడాతో ఓడించాడు. మొదటి నుంచి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు శ్రీకాంత్ తన ప్రత్యర్థి నుంచి ఎదురైన పోటీని సమర్థంగా తిప్పికొట్టి, ప్రీ క్వార్టర్స్‌లో స్తానం సంపాదించాడు. ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌లో ఉగాండాకు చెందిన ఎడ్విన్ ఎకిరింగ్‌పై 21-14, 21-19 తేడాతో గెలిచి, ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇవాళ సాయంత్రం జరగనున్న మ్యాచ్ లో గెలిచి వీరు కూడా క్వార్టర్స్ లోకి ప్రవేశించాలని అశిస్తున్నారు. ఇవాళ సాయంత్రం కిదాంబి శ్రీకాంత్ హు యున్ తో తలపడనుండగా, హెచ్ ఎస్ ప్రణాయ్ డిక్టర్ ఎలెక్సన్ తో తలపడనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Jwala Gutta  Ashwini Ponnappa  World Badminton Championship  

Other Articles