Pv sindhu defends macau open grand prix gold badminton title

pv sindhu, pv sindhu latest news, pv sindhu macau open title, pv sindhu macau grand prix gold badminton title, pv sindhu sports news, pv sindhu macau title, pv sindhu news, pv sindhu titles, pv sindhu press meet, pv sindhu interview, pv sindhu macau final match, sports news, sports news in telugu, telugu sports news, pm narendra modi, narendra modi twitter

PV Sindhu Defends Macau Open Grand Prix Gold Badminton Title

రెండోసారి ‘ఛాంపియన్’ టైటిల్ గెలుచుకున్న తెలుగమ్మాయి

Posted: 12/01/2014 12:47 PM IST
Pv sindhu defends macau open grand prix gold badminton title

ప్రపంచ ఛాంపియన్ షిప్, ఆసియా, కామన్వెల్త్ వంటి క్రీడల్లో కాంస్యా పతకాలతో సరిపెట్టుకున్న బ్యాడ్మింటన్ తెలుగుతేజం పి.వి.సింధు.. మకావు గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో మాత్రం ఛాంపియన్’గా అవతరించి తన సత్తాఏంటో ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిరూపించుకుంది. మకావు టోర్నీలో మొదటినుంచి ప్రత్యర్థులను అలవోకగా ఓడిస్తూ ముందుకు దూసుకెళ్లిన సింధు.. చివర్లో మాత్రం టైటిల్ గెలవడంలో కాస్త శ్రమించింది. మొదట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ఎదురుదెబ్బ పడ్డా.. ఆ తర్వాత తన ప్రతిభతో చెలరేగింది. ఒకానొక చోట పాయింట్ల ఆధిక్యంతో ప్రత్యర్థిని వెనుక నెట్టేసి.. చివరకు ఛాంపియన్’గా నిలిచింది. ఈ ఏడాది ఆమెకిదే తొలిటైటిల్. మకావు నెగ్గడం ఆమెకిది రెండోసారి!

మొదటినుంచి సీడెడ్ క్రీడాకారిణులను ఓడిస్తూ వచ్చిన సింధు.. టైటిల్ పోరులో మాత్రం అన్’సీడెట్ షట్లర్’తో కాస్త శ్రమించింది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్’లో సింధు 21-12, 21-17 స్కోరుతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ హుయో మిన్’ను ఓడించింది. 91వ ర్యాంకర్ అయిన కిమ్.. ఆరు, నాలుగు, ఏడో సీడ్ క్రీడాకారిణులను తన ప్రతిభతో బాగానే ఓడించుకుంటూ ఫైనల్’కు చేరుకుంది. ఆమె కనబరిచిన ప్రతిభను చూసి సింధును కూడా అలాగే ఓడిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. సింధు అలా జరగనివ్వలేదు. కిమ్’తో మొదట్లో కాస్త తడబడిన సింధు, ఆ తర్వాత ఆమె ఆటతీరును అర్థం చేసుకుని ఎంతో సులువుగా ఓడించగలిగింది.

కిమ్ మ్యాచ్ ఆరంభంలో 3-0 స్కోరుతో ఆధిక్యంలో వెళ్లింది. అయితే ప్రత్యర్థి అంచనాకు వచ్చిన సింధు 6-6తో స్కోరును సమం చేసింది. కిమ్ పుంజుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. సింధు తన పదునైన స్మాష్’లతో ఆమెక అవకాశం ఇవ్వలేదు. విరామానికి ముందు 11-8తో ఆధిక్యంలో వున్న సింధు.. ఆ తరహాలోనే తన ప్రతిభను ప్రదర్శిస్తూ 21-12తో గేమ్ గెలుచుకుంది. ఇక రెండో గేమ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఒక దశలో 7-7తో ఇద్దరూ సమానంగా నిలిచారు. విరామ సమయానికి కిమ్ 11-8తో ఆధిక్యంలోకి చేరింది. అయితే తర్వాత సింధు వేగం పుంజుకుని 13-13తో సమం చేసింది. ఇక అక్కడినుంచి జోరు తగ్గించకుండా ప్రదర్శించిన సింధు.. 21-17తో మ్యాచ్’ను ముగించింది.

ఈ విధంగా మకావు టైటిల్’ను రెండుసార్లు సాధించిన భారత తొలిషట్లర్’గా పివి సింధు ఘనత సాధించింది. పతకాలు సాధించడమేగాక ఏ ఇతర క్రీడాకారిణులు తమకు అడ్డుకాదని నిరూపించుకోగలిగింది. ఇంతటి అద్భుత విజయంతో టోర్నీని ముగించిన సింధుకు భారతవ్యాప్తంగా ఎంతోమంది అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ గెలుపుపై స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘సింధు మకావు ఓపెన్ గెలిచినందుకు సంతోషంగా వుంది. ఆమె విజయం పట్ల దేశం గర్విస్తోంది’’ అంటూ పేర్కొన్నారు. ఇక ఇతర దిగ్గజాలు కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles