Medals for india in asain games

sania mirza, asian games, asian games latest updates, asian games india medals, indian athlets in asian games, sports news, sushil kumar, mary kom, shagun chowdary, varsha varman, abhinav bindra, saina nehwal, pv sindhu, latest news, asain games finals

indian athlets showing their performance in asian games and brings more medals to india : 2014 asian games giving good result for india as our athlets winning more medals than 2010 games

చిన్న దేశాల ముందు తలదించుకుంటున్న భారత్

Posted: 09/30/2014 02:24 PM IST
Medals for india in asain games

ప్రపంచలోనే జనాభాలో రెండవ పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ కు ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. కాని ప్రపంచ క్రీడల్లో మాత్రం పట్టు సాధించలేకపోతుంది. మనకంటే చిన్న దేశాలు పతకాలు కొట్టుకుపోతుంటే మనమలా నిల్చుని చూస్తున్నాం. ఆసియా గేమ్స్ లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ది ప్రేక్షక పాత్ర తప్ప మరొకటి లేదు. కొన్ని మ్యాచ్ లలో క్వాలిఫైయింగ్ రౌండ్ లోనే ఇంటికి టికెట్ బుక్ చేసుకున్న ఆటగాళ్లు ఇండియాకు ఉన్నారు. చైనాతో ఏ జనాభాలో, తెలివిలో ఏ మాత్రం తీసిపోని భారత్ ఆటల విషయానికి వస్తే మాత్రం ఎందుకు వెనకబడుతోంది.

ప్రపంచ జనాభాను చూస్తే భారత్ రెండవ స్థానంలో ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో 136.70 కోట్ల మంది ప్రజలు ఉంటే.., భారత్ లో 126.02కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే భారత్ జనాబా చైనా జనాభా కంటే సరాసరిగా కేవలం పది కోట్లు మాత్రమే తక్కువ అన్న మాట. ఇదే పతకాల పట్టికలో చూస్తే మాత్రం చైనా సాధించిన కాంస్య పతకాల కంటే మనం సాధించిన మొత్తం పతకాలు తక్కువే. అంటే మన పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం వరకు వచ్చిన పతకాలను పరిశీలిస్తే.., చైనాకు మొత్తం స్వర్ణాలు 112 వస్తే భారత్ కు ఏకంగా 6 వచ్చాయని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక రజత పతకాలు డ్రాగన్ 72సాధిస్తే.., మనం వారి నంబర్ లో మొదటిది అయిన 7 ను గెలిచి పక్కన రెండే కదా లేనిది అనుకుంటున్నాం. కాంస్య పతకాలు కూడా పొరుగు దేశం 52 సాధిస్తే మనం 29 గెలుచుకున్నాం. మొత్తంగా చైనాకు 238 పతకాలు వస్తే.., మనకు 42 పతకాలు వచ్చాయి. అంటే జనాభాలో కేవలం పది కోట్లు తక్కువగా ఉన్న భారతదేశం పతకాల విషయంలో మాత్రం చైనాతో పావు వంతు కూడ సరితూగలేకపోతుంది.

చైనాలో జనాభా ఎక్కువగా ఉన్నారు అనుకుంటే మిగతా దేశాలనే తీసుకుందాం. దక్షిణ కొరియా నిత్యం పొరుగున ఉన్న సోదర దేశంతో తగువు పెట్టుకుంటున్నా ఆటల విషయంలో మాత్రం 146 పతకాలతో రెండవ స్థానంలో ఉంది. జపాన్ టెక్నాలజిలో ముందు ఉండటంతో పాటు అథ్లెట్ల లోనూ సత్తా చాటుతోంది. ఆదేశ క్రీడాకారులు సోమవారం వరకు 132 పతకాలను సాధించారు. వీటన్నిటి విషయం పక్కనబెట్టినా కజకిస్థాన్ నే తీసుకుందాం. ఆ దేశ జనాభా 175 మిలియన్లు. ప్రపంచంలో జనాభా పరంగా 62వ స్థానంలో ఉంది. అంటే మనకంటే 60 స్థానాలు వెనక ఉంది. ఆసియా గేమ్స్ పతకాల విషయంలో మాత్రం మనకంటే ముందు ఉంది. సోమవారం వరకు కజకిస్థాన్ కు 15స్వర్ణాలు వస్తే.. మనకు దాంట్లో సగం కూడా రాకుండా 6తో సరిపెట్టుకున్నాం. ఒక్క కాంస్యం విషయంలో మాత్రమే ఆ దేశానికి 22వస్తే మనకు 29 వచ్చాయి. ఇది చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమి కాదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వారి సంఖ్య తక్కువ కాబట్టి.., పోని మొత్తంగా అయిన సరే ఆ దేశంతో సమానంగా ఉన్నామా అంటే ఖజకిస్థాన్ కు మొత్తం పతకాలు 53వస్తే మనకు మాత్రం 42వచ్చాయి.

మన దేశంలో మెరుగైన మానవ వనరులు ఉన్నాయి అని అంతా గొప్పగా చెప్పుకుంటున్నాము. కాని ఆటల్లో మాత్రం ఆ గొప్పతనం చెప్పుకోలేకపోతున్నాము. క్రికెట్ తప్ప మిగతా ఆటల్లో ప్రపంచంలో సత్తా చాటేవారి పేర్లను ఒక పేజికి మించి రాయలేము. మన దగ్గర టాలెంట్ లేదు అనేది ఇక్కడ కధనంలో.., విమర్శలో ఉద్దేశ్యం కాదు. ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావటం లేదు. ఎప్పుడో ఒక సారి ఇలాంటి పోటిలు పెట్టినపుడు ఒక సాకేత్, ఓ జ్యోత సురేఖ, మేరికోమ్ వంటి వారు వెలుగులోకి వస్తున్నారు. అప్పటి వరకు వారు ఉన్నారు అనే సంగతి సొంత ఊరి వారికి కూడా సరిగా తెలియదు. ప్రభుత్వాలు క్రీడల కోసం ప్రత్యేక శాఖలు, నిధులు కేటాయిస్తున్నాయి తప్ప.., చిత్తశుద్దిగా క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావటం లేదు.

ప్రతిభ ఉన్న ఎంతోమంది పేద క్రీడాకారులు చీకటిలోనే మగ్గుతున్నారు. ఊరిలో ఉన్న గ్రౌండుకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రపంచ స్థాయి పోటిలకు ఎదగలేకపోతున్నారు. ప్రభుత్వాలు మిగతా పనుల్లో పోటి పడుతున్నట్లే క్రీడల విషయంలోనూ పోటి పడాలి. ప్రతిభ ఉన్న వారికి పేదరికం అడ్డు రాకుండా.., ప్రత్యేక పోటిలు పెట్టి.., ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వమే వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించాలి. కుటుంబ పరిస్థితులు అడ్డు రాకుండా క్రీడాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలా వారికి చేయూతనిస్తే ఎంతోమంది మెరికలు బయటకు మెరుస్తారు. గెలిచిన తర్వాత కోటి రూపాయలు ఇవ్వటం కాదు.., గెలవటానికి అవసరమయ్యే చేయూతనిస్తే సరిపోతుంది అని క్రీడా విశ్లేషకులు, అభిమానులు అంటున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే వచ్చే ఆసియా గేమ్స్ లో భారత్ చైనాకు గట్టి పోటిని ఇస్తుంది. అలా జరగాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  athlets  latest news  sprots news  

Other Articles