Virat Kohli's unusual training with special mask before vs Pakistan హై ఆల్టిట్యూడ్ మాస్క్ ధ‌రించి.. విరాట్ కోహ్లీ క‌ఠోర‌ శిక్ష‌ణ‌

Virat kohli trains wearing high altitude mask ahead of clash vs pakistan

kohli, virat kohli, india vs pakistan, kohli training, virat kohli mask training, kohli training mask, virat kohli mask, kohli india vs pakistan, kohli india pakistan, ind vs pak, india vs pakistan asia cup, ind vs pak asia cup, ind vs pak asia cup 2022, Cricket news, sports news, Cricket, sports

Pakistan's crushing win over Hong Kong has paved the way for Round 2 of one of the greatest rivalries in world cricket – India vs Pakistan. Ahead of the much-anticipated clash, the one and Virat Kohli decided to test himself like never before as he underwent an unusual training session at the ICC Cricket Academy Ground in Dubai.

హై ఆల్టిట్యూడ్ మాస్క్ ధ‌రించి.. విరాట్ కోహ్లీ క‌ఠోర‌ శిక్ష‌ణ‌

Posted: 09/03/2022 07:48 PM IST
Virat kohli trains wearing high altitude mask ahead of clash vs pakistan

ఆసియాక‌ప్ సూప‌ర్ 4 స్టేజ్‌లో.. ఇండియా రేపు పాకిస్థాన్‌తో ఆడ‌నున్న‌ది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా నెగ్గిన విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం జ‌రిగే పోరు కోసం టీమిండియా క్రికెట‌ర్లు తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా క‌ఠోర సాధ‌న చేస్తున్నాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అత‌ను దుబాయ్ మైదానంలో చ‌మ‌ట‌లు చిందిస్తున్నాడు. హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను ధ‌రించి మ‌రీ కోహ్లీ శిక్ష‌ణ‌లో పాల్గొన్నాడు. గ్రౌండ్‌లో ప‌రుగులు తీసిన విరాట్ ఆ స‌మ‌యంలో త‌న ముఖానికి హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను ధ‌రించాడు.

విరాట్ ఫ్యాన్స్ క్ల‌బ్ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో.. కోహ్లీ శిక్ష‌ణ‌కు సంబంధించిన ఫోటోల‌ను అప్‌లోడ్ చేశారు. ఇటీవ‌ల పెద్ద‌గా ఫామ్‌లో లేని కోహ్లీ.. తాజాగా జ‌రుగుతున్న ఆసియా క‌ప్‌లో ప‌ర్వాలేద‌నిపించాడు. ఇక త్వరలోనే తమ అభిమాన క్రికెటర్ మంచి ఫామ్ లోకి వచ్చి.. ప్రత్యర్థి బౌలర్లను వీరు ఉతుకుడు ఉతుకుతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆడిన రెండు మ్యాచుల్లో అత‌ను 94 ర‌న్స్ చేశాడు. హాంగ్‌కాంగ్‌పై 59 ర‌న్స్ చేయ‌గా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 35 ర‌న్స్ చేశాడు. ఇక రేపు జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌లో విరాటుడు తన బ్యాటును ఎలా జులిపిస్తాడన్నది వేచి చూడాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles