RP Singh picks Rishabh Pant over KL Rahul for Pakistan Match ‘‘ఆసియా కప్ జట్టు నుంచి రాహుల్ ను తప్పించండీ’’

It feels like he can t do anything rp singh picks rishabh pant over kl rahul for asia cup

kl,rahul, india, kl rahul india, Rishabh pant, RP singh, Surya kumar Yadav, kl rahul form, Rohit Sharma, Dinesh Karthik, kl rahul form, kl rahul injury, kl rahul team india, asia cup, asia cup 2022, ind vs pak, india vs pakistan asia cup, ind vs pak asia cup, ind vs pak asia cup 2022, Cricket news, sports news, Cricket, sports

Former Indian pacer RP Singh wants Rishabh Pant to be included in India vs Pakistan Super 4 match. He said that Pant is a match-winner, and he deserves to play over either Dinesh Karthik or KL Rahul in this match. He said that he was surprised that Karthik did not keep wickets in the match against Hong Kong.

‘‘ఆసియా కప్ జట్టు నుంచి రాహుల్ ను తప్పించండీ’’

Posted: 09/03/2022 08:54 PM IST
It feels like he can t do anything rp singh picks rishabh pant over kl rahul for asia cup

టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. నిన్నటివరకు ఆయన బ్యాట్ తో చక్కగా రాణించినా.. ఒకటి రెండు మ్యాచులలో విఫలం కాగానే ఆయనను తప్పించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రాహుల్ ను చూస్తుంటే ఆయన తన బ్యాట్ తో ఏం చెయ్యలేడని అనిపిస్తోందని, అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన రాహుల్.. హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఇన్నింగ్స్ (39 బంతుల్లో 36 పరుగులు) ఆడాడు.

దీంతో రాహుల్ ను అప్పుడే టార్గెట్ చేశారు టీమిండియా మాజీ క్రికెటర్లు. రాహుల్ ఆసియా కప్ ప్రదర్శనపై స్పందించిన ఆర్పీ సింగ్.. రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని, అతన్ని జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. ‘‘డీకే లేదా రాహుల్‌ను పక్కనపెట్టి పంత్‌ను తీసుకోవాలి. అతను ఆడితే జట్టును సులభంగా గెలిపిస్తాడు. రాహుల్‌ ఆడతాడని నాకు అనిపించడం లేదు. తన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏం చెయ్యలేడని అనిపిస్తోంది. అతనికి మరింత టైం కావాలి. గాయం నుంచి కోలుకున్నాక టైమింగ్ కోల్పోయాడు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు’’ అని సింగ్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles