ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో.. భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ డికాక్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో డికాక్‌ను అభినందిస్తూ సహచర ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం సెలబ్రేషన్స్ వద్దు టైం అవుతోంది అంటూ సైగలు చేశాడు.
అయితే మ్యాచ్ కటాఫ్ సమయం దగ్గరపడడంతో.. గేమ్‌ను త్వరగా ముగించాలని రాహుల్ భావించాడు. అందుకే ఆ సైగలు చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ముగించకపోతే స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఏంటి రాహుల్ భయపడ్డావా, ఫైన్ వేస్తారని అని కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 68 పరుగులు సాధించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
KL Rahul worried about slow over-rate fine.. #IPL2022 #LSGvsSRH pic.twitter.com/ByZzJRE5pe
— That-Cricket-Girl (@imswatib) April 4, 2022
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more