KL Rahul joins IPL elite list సెహ్వాగ్ ను వెనక్కునెట్టి ధోని, కోహ్లీల సరసన రాహుల్

Ipl 2022 kl rahul surpasses virender sehwag to join dhoni virat kohli in elite list

IPL 2022, IPL, Indian Premier League, Lucknow Super Giants, LSG, KL Rahul, Virat Kohli, MS Dhoni, Shikhar Dhawan, Suresh Raina, Rohit Sharma, India Cricket Team, cricket, IPL, sports

Lucknow Super Giants (LSG) skipper KL Rahul played a brilliant knock in the Indian Premier League (IPL) clash against Sunrisers Hyderabad, scoring 68 runs off just 50 deliveries as the team finished with 169/7 after being put to bat first. And proceeding towards his knock, KL Rahul went past Virender Sehwag to join MS Dhoni and Virat Kohli in an elite list.

సెహ్వాగ్ ను వెనక్కునెట్టి ధోని, కోహ్లీల సరసన కెఎల్ రాహుల్.!

Posted: 04/05/2022 06:31 PM IST
Ipl 2022 kl rahul surpasses virender sehwag to join dhoni virat kohli in elite list

ఇండియన్ ప్రిమియర్ లీగ్ అనగానే అభిమానుల ఫేవరేట్ జట్లుగా రాణిస్తున్న జట్లను కూడా తోసిరాజుతూ ఎలాంటి అంచనాలు లేకుండా కొత్తగా వచ్చినా.. కొత్తదనంతో వచ్చినట్టు దూసుకుపోతోంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్లు.. అప్పుడే ఫ్లే-ఆఫ్ కు కూడా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అందుకు కారణంగా జట్టుకు సారధ్యబాధ్యతలు వహిస్తున్న కేఎల్ రాహుల్ నాయకత్వం. తన తోటి ఆటగాళ్లను అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తున్న విధానం.. వారిని నిత్యం ప్రోత్సహిస్తున్న కారణంగా ఈ జట్టు ముందుకు దూసుకెళ్తోంది.

ఇక లక్నో జట్టు కెప్టెన్.. టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 50 అర్ధసెంచరీలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేసిన రాహుల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కాగా రాహుల్‌కు ఐపీఎల్‌లో ఇది 28వ అర్ధసెంచరీ. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. అతడు 76 అర్దసెంచరీలు సాధించాడు.

టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు
విరాట్‌ కోహ్లి(328 మ్యాచ్‌లు)- 76 అర్ధ సెంచరీలు
రోహిత్‌ శర్మ(372 మ్యాచ్‌లు )- 69 అర్ధ సెంచరీలు
శిఖర్‌ ధావన్‌(305 మ్యాచ్‌లు)- 63 అర్ధ సెంచరీలు
సురేష్‌ రైనా  (336 మ్యాచ్‌లు)-53 అర్ధ సెంచరీలు
కెఎల్‌ రాహుల్‌(175 మ్యాచ్‌లు)-50 అర్ధ సెంచరీలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  IPL 2022  LSG  KL Rahul  Virat Kohli  MS Dhoni  Shikhar Dhawan  Suresh Raina  Rohit Sharma  cricket  IPL  sports  

Other Articles