Virushka donate Rs1 million for Mumbai police కరోనాతో పోరాడుతున్న పోలీసులకు విరాట్ సాయం

Virat kohli anushka sharma donate for mumbai police welfare

Virat Kohli, Anushka Sharma, COVID-19, Coronavirus, Mumbai Police, Mumbai Police commissioner, Param Bir Singh, cricket news, sports news, todays cricket match, today cricket match score, cricket, sports

In a recent development, Mumbai Police commissioner Param Bir Singh, informed that Indian cricket captain Virat Kohli and wife actor Anushka Sharma have contributed Rs 5 lakh each for police welfare amid the outbreak of the coronavirus pandemic.

కరోనాతో పోరాడుతున్న పోలీసులకు విరాట్ సాయం

Posted: 05/11/2020 10:00 PM IST
Virat kohli anushka sharma donate for mumbai police welfare

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫాలితాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇక ప్రజలను నియంత్రిచడంతో పాటు ఎవర్నీ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా నిలువరిస్తూ.. అహర్నిషలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారడంతో పాటు అందోళనకంగానూ మారింది.

దీంతో పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యానికి గురికావద్దని కోరుకుంటూ టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీ, అతని సతీమణి సినీనటి అనుష్క వారికి మనోధైర్యాన్ని అందించి పోలీసులకు అండగా తాము వున్నామని స్పష్టం చేశారు. అదెలా అంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో కోహ్లీ దంపతులు వారి సంక్షేమానికి విరాళం అందించారు. ఇద్దరూ చెరో రూ.5లక్షలు చొప్పున వారి సంక్షేమానికి అందజేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసు కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ తెలిపారు.

విరాళం అందజేసిన విరుష్క దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కరోనాపై పోరుకు అంతకుముందు పీఎం-కేర్స్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ఈ దంపతులు విరాళం అందించారు. అయితే, ఎంతమొత్తం ఇచ్చిందీ వారు వెల్లడించలేదు. దేశంలోనే అత్యధిక మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య దాదాపు 20వేలకు చేరువైంది. అందులో సింహభాగం ముంబయిలోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles