ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ పై తనకు విశ్వాసం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆస్ట్రేలియా ఏ విధంగా నంబర్ వన్ జట్టని ప్రశ్నించారు. 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్న భారత్.. తాజా ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయింది. దీనిపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా న్యూజిలాండ్ తో మినహా అన్ని టెస్టు సిరీస్ లు గెలించిందని అన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై విజయం సాధించిందని గంభీర్ గుర్తుచేశారు.
ఆసీస్ జట్టు ఇంటా, బయటా ఓటములు చవిచూసిందని, ఈ నేపథ్యంలో ఆ జట్టు ఎలా నంబర్ వన్ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పద్ధతితో పాటు ర్యాంకింగ్స్ పైనా తనకు విశ్వాసం లేదన్నారు. టీమిండియా టెస్టుల్లో మూడో స్థానానికి పడిపోవడంతో తనకేమీ ఆశ్చర్యం కలగలేదన్నారు. సహజంగానే తాను పాయింట్లు, ర్యాకింగ్ పద్ధతిని నమ్మబోనని, ముఖ్యంగా విదేశీ గడ్డలపై టెస్టు మ్యాచ్లు గెలిస్తే కూడా ఒకే స్థాయిలో పాయింట్లు కేటాయించడం సరికాదని గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఇక ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవడంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. తన దృష్టిలో టీమిండియానే అగ్రస్థానంలో కొనసాగాలని తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఇండియా ఆస్ట్రేలియా పర్యటనపై స్పందిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కరోనా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. దీంతో భారత ఆటగాళ్లు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఐసోలేషన్‌లో ఉంటారని ధుమాల్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని గంభీర్ స్వాగతించారు.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more