Virat Kohli loses top spot in ICC Test rankings విరాట్ స్థానంలోకి స్మిత్.. బూమ్రా ఔట్..

Steve smith dethrones virat kohli to regain top spot in icc test rankings

steve Smith, Virat Kohli, ICC test Rankings, Steve Smith vs Virat Kohli, ICC rankings, Ajinkya rahane, Cheteshwar Pujara, indian cricket team, Cricket, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Australia run-machine Steve Smith moved past India captain Virat Kohli to reclaim the No.1 Test batsman. Kohli dropped 5 points after a poor outing in both the innings of Wellington Test.

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్: విరాట్ స్థానంలోకి స్మిత్.. బూమ్రా ఔట్..

Posted: 02/26/2020 09:31 PM IST
Steve smith dethrones virat kohli to regain top spot in icc test rankings

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి షాక్‌ తగిలింది. టెస్ట్‌ బ్యాట్సమన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 911 పాయింట్లతో స్మిత్‌ టాప్‌కు చేరాడు. 906 పాయింట్లతో కోహ్లి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు.

తాజా ర్యాంకులలో టీమిండియాతో టెస్టులో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ సంచలనం మార్నస్ లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్10లో ప్రవేశించాడు. మయాంక్ 727 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానే ఈ ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కించుకోగా, చటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై 9వ ర్యాంకుకు పడిపోయాడు.

డేవిడ్‌ వార్నర్‌ 6, జోయ్‌ రూట్‌ 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. కివీస్‌ జరిగిన తొలి టెస్ట్‌లో కేవలం 21 పరుగులు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. అటు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా ప్రధాన జస్‌ప్రీత్‌ బుమ్రా టాప్‌ -10 నుంచి కిందకు పడిపోయాడు. ఇండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే టాప్‌టెన్‌లో ఉన్నాడు. అతడు 9వ ర్యాంకు దక్కించున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles