India beat New Zealand by 18 runs in World Cup న్యూజీలాండ్ పై భారత్ ఉత్కంఠ విజయం

Icc women s t20 world cup india qualify for semi finals post last ball thriller against kiwis

Harmanpreet Kaur, women’s T20 World Cup, Shaifali Verma, New Zealand, Team India, india women, New Zealand women, poonam yadav, deepti sharma, harmanpreet kaur bhullar, womens t20 world cup 2020, New Zealand women vs india women, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

India’s women team became the first to qualify for the semi-finals of the ICC Women’s T20 World after clinching a nail-biting thriller against New Zealand by 4 runs at the Junction Oval in Melbourne.

మహిళల టీ-20 వరల్డ్ కప్: భారత్ ఖాతాలో మూడో విజయం

Posted: 02/27/2020 07:03 PM IST
Icc women s t20 world cup india qualify for semi finals post last ball thriller against kiwis

ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన తొలిజట్టుగా నిలిచింది. మహిళల ప్రపంచకప్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తూ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మరో అద్భుత, ఉత్కంఠ పోరులో హర్మన్ ప్రీత్‌ సేన 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌ సెమీస్ కు చేరడం ఖాయమైంది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రబాగన నిలిచిన మరో రెండు జట్లలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. వీటిలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు కూడీ సెమిస్ కు చేరనుంది.

ఇదిలా ఉండగా, 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివర్లో అమెలియా కెర్ర్‌(19 బంతుల్లో 34) ధాటిగా ఆడినా కివీస్‌కు ఓటమి తప్పలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును.. మ్యాడీ గ్రీన్‌( 23 బంతుల్లో 24), క్యాటీ మార్టిన్‌(; 28 బంతుల్లో 25) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాక.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివరి రెండు ఓవర్లలో అమెలియా కెర్ర్‌, హయ్‌లీ జెన్‌సన్‌ ధాటిగా ఆడి భారత్‌ను కంగారు పెట్టించారు. కివీస్‌కు ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా శిఖా పాండే అద్భుతంగా బౌలింగ్‌ చేసి గెలపించింది.

అంతకుముందు టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ(46; 34 బంతుల్లో 4x4, 3x6) ధాటిగా ఆడగా, తానియా భాటియా(23; 25 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బంతులేయడంతో ఓపెనర్‌ స్మృతి మంధాన(11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(1), జెమిమా రోడ్రిగ్స్‌(10), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖాపాండే(10), రాధా యాదవ్‌(14) నిలవడంతో న్యూజిలాండ్‌ ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ (2), అమెలియా కెర్ర్‌(2), తాహుహు(1), సోఫీ డివైన్‌(1), కాస్పెరిక్‌(1) వికెట్లు తీశారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles