Harbhajan Singh Suggests a Tactical Change కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

yuzvendra chahal, kuldeep yadav, harbhajan singh, india cricket news, ind vs nz, new zealand cricket news, cricket, india cricket news, new zealand cricket news, ind vs nz, nz vs ind, india vs new zealand, india tour of new zealand 2020, new zealand vs india

According to Harbhajan Singh, the Indian pair comprising Kuldeep Yadav and Yuzvendra Chahal should play together in the rest of the two ODIs against New Zealand even if it means dropping Kedar Jadhav. The former Indian cricketer believes that the duo will b challenging for the hosts.

కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

Posted: 02/06/2020 10:31 PM IST
Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు చేస్తే విజయం వరిస్తుందని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు టీమిండియా జట్టకు ఆయన ఒక ప్రధాన సూచనిచ్చాడు. అక్లాండ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటివ్వాలని పేర్కొన్నాడు.

కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ సమష్టిగా ప్రభావం చూపించగలరని ధీమా వ్యక్తం చేశాడు. ‘కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ కలిసి ఆడాలి. న్యూజిలాండ్‌ జట్టు పేసర్లను ఎప్పుడైనా అలవోకగా ఎదుర్కోగలదు. స్పిన్నర్ల విషయంలో మాత్రం కాస్త తడబడుతుంది. మణికట్టు స్పిన్నర్లు కీలక వికెట్లను మధ్య ఓవర్లలో తీయగలరు. అందుకే వారిద్దరూ జట్టులో ఉండాలన్నది నా సూచన. బహుశా కేదార్‌ జాదవ్‌ను తొలగించి అదనపు స్పిన్నర్‌ను ఆడిస్తే మంచిది’ అని భజ్జీ అన్నాడు.

హర్భజన్ వ్యాఖ్యలతో కోరె అండర్సన్‌ ఏకీభవిస్తూనే.. మైదానం చిన్నది కాబట్టి అది కుదరకపోవచ్చన్నాడు. ‘ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఆడితే బాగుంటుంది. రెండో వన్డే వేదికైన ఆక్లాండ్లో మైదానం చిన్నది కాబట్టి ఒక్కర్నే ఆడించొచ్చు. బహుశా భారత్‌ పేసర్‌ను లేదా బ్యాటింగ్‌ చేయగల ఆల్ రౌండర్ ను ఎంచుకోవచ్చు’ అని అండర్సన్‌ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్ ను 5-0తో ఊడ్చేసిన కోహ్లీసేన మూడు వన్డేల సిరీసులో 0-1తో వెనకబడింది. కీలకమైన రెండో మ్యాచులో నెగ్గాలని పట్టుదలతో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  yuzvendra chahal  kuldeep yadav  harbhajan singh  auckland odi  ind vs nz 2020  cricket  

Other Articles