MS Dhoni was not made in a day: Yuvraj పంత్.. ధోనిలా మారాలంటే సమయం కావాలి: యువరాజ్

Rishabh pant is work in progress don t suppress him yuvraj

virat kohli, virat kohli india vs south africa, india vs south africa 3rd t20, rishabh pant, MS Dhoni Yuvraj, bangalore 3rd t20, first batting, toss winning decision, ind vs sa, quinton de kock, cricket news, sports news, sports, cricket

Former India all-rounder Yuvraj Singh said the Indian team management needs to understand Rishabh Pant's thinking process and work accodingly to help him overcome the lean patch in international cricket.

పంత్.. ధోనిలా మారాలంటే సమయం కావాలి: యువరాజ్

Posted: 09/24/2019 09:02 PM IST
Rishabh pant is work in progress don t suppress him yuvraj

భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లోనూ వైఫల్యంతో తన స్థానానికి ముప్పు తెచ్చుకుంటున్న రిషబ్ పంత్ కు యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఎంఎస్ ధోనీలా పంత్ బంతులు సరైన క్రమంలో పడుతున్నాయా.? లేదా.? అని పర్యవేక్షించి డీఆర్ఎస్ తీసుకోవాలా.. లేదా అని విశ్లేషించి జట్టు సారధికి చెప్పాల్సిన బాధ్యత వున్న వికెట్ కీపర్ గా, అటు బ్యాట్స్ మెన్ గానూ విఫలం అవుతున్న తరుణంలో అతడిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో పంత్ కు మద్దతుగా నిలిచాడు యువరాజ్ సింగ్. మహేంద్ర సింగ్ ధోని ఒక్కరోజులోనే గొప్ప వికెట్ కీపర్ కాలేదని, జట్టులో ధోనీ స్థానం సుస్థిరం కావడానికే చాలా సమయం పట్టిందని అన్నాడు. ఇప్పుడు పంత్ విషయంలోనూ అలాగే భావించాలని, టి20 ప్రపంచకప్ కు ఇంకా సమయం ఉన్నందున పంత్ పై ఒత్తిడి పెంచడం సరికాదని అన్నాడు. ధోని స్థానంలో వచ్చిన వాడు.. వచ్చి రావడంతోనే ధోని కన్నా మెరుగ్గా ప్రదర్శన చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

పేలవ ప్రదర్శన నేపథ్యంలో పంత్ ను కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ, పంత్ నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించేవాళ్లు ముందు అతడి ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవాలని సూచించాడు. పంత్ లాంటి ఆటగాడికి మద్దతుగా నిలచి ప్రోత్సహించాలని.. అప్పుడే వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టవచ్చని టీమిండియా మేనేజ్ మెంట్ కు హితవు పలికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles