kohli fans troll chahar for taking DRS దీపక్ చాహర్ ను అడుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్

Fans blame deepak chahar for forcing virat kohli to take drs

virat kohli, virat kohli india vs south africa, india vs south africa 3rd t20, bangalore 3rd t20, dhoni review system, DRS, Rishabh pant, decision, ind vs sa, quinton de kock, cricket news, sports news, sports, cricket

Former Indian cricketer Madhav Apte passed away due to a cardiac arrest at the Breach Candy Hospital in Mumbai on Monday morning. He was 86 years old.

దీపక్ చాహర్ ను అడుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్

Posted: 09/23/2019 09:05 PM IST
Fans blame deepak chahar for forcing virat kohli to take drs

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో ముగియగానే కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వచ్చాయి. ఆయన బ్యాట్స్‌మెన్ గానే కాకుండా.. సారధిగా కూడా విఫలమయ్యాడని నెట్ జనులు విరుచుకుపడ్డారు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు మరో పంథాలో విమర్శలను టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సహా దీపక్ చాహర్ పైకి మళ్లించి.. తమ విమర్శల జడిని కొనసాగించారు. దీంతో నెట్టింట్లో దీపక్ చాహర్ ను కోహ్లీ అభిమానులు ఆటాడుకుంటున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని జట్టు ఓటమికి సగం కారణమైన విరాట్ కోహ్లీ.. డీఆర్‌ఎస్‌ నిర్ణయంలోనూ బౌలర్, కీపర్ చెప్పింది విని ఫెయిలయ్యాడు. డీఆర్ఎస్ విఫలమైన క్షణంలో చిన్నస్వామి స్టేడియంలో వినిపించిన ఏకైన పేరు ధోని. మహేంద్రుడు లేకపోతే డీఆర్‌ఎస్లో కోహ్లీ విజయవంతం కాలేడనే ఇటీవలే గౌతమ్ గంభీర్ చేసిన అపవాదే నిజమైంది. ఎలా అంటే.. బెంగుళూరు టీ20లో ఇన్నింగ్స్‌ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ నకుల్ బాల్ ఇందుకు కారణమైంది.

అదెలా అంటే చాహర్ వేసిన బంతి.. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆర్. హెండ్రిక్స్ ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి అతని ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే.. బంతి వికెట్లకి తాకేలా వెళ్లిందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించిన దీపక్ చాహర్.. డీఆర్‌ఎస్‌ కోరేలా చేశాడు. రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌ లైన్‌ పడి వికెట్లకి చాలా దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో.. విరాట్ కోహ్లీ సిగ్గుతో తన ముఖాన్ని క్యాప్‌తో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.

దీంతో.. విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తడం వాటితో మండిపడ్డ సారధి ఫాన్స్.. దీపక్ చాహర్ పై ఓ రేంజ్ లో అగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట్లో ఫైర్ కావడం కనిపించింది. కోహ్లీని డీఆర్‌ఎస్ కోరేలా బలవంతంగా ఒప్పించి.. అవమానించావంటూ మండిపడుతున్నారు. సఫారీలతో మ్యాచ్ లలో భారత్ జట్టుకి ధోనీ దూరంగా ఉండగా.. రిషబ్ పంత్‌ కీపర్‌గా ఉన్నాడు. ధోనీ తరహాలో పంత్ కచ్చితమైన అభిప్రాయం చెప్పలేకపోతుండటంతో.. బౌలర్‌తో మాట్లాడిన తర్వాత కోహ్లీ డీఆర్‌ఎస్‌ అడిగేస్తున్నాడు. కానీ.. ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india vs south africa  bangalore 3rd t20  first batting  quinton de kock  cricket  

Other Articles