Trying to take toss out of equation: Virat Kohli కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఓటమా.?

Virat kohli admits that india failed to read the tempo of the game

virat kohli, virat kohli india vs south africa, india vs south africa 3rd t20, bangalore 3rd t20, first batting, toss winning decision, ind vs sa, quinton de kock, cricket news, sports news, sports, cricket

Despite enduring a crushing nine-wicket defeat against South Africa in the third and final T20I, Virat Kohli is eager to take more risks with an objective to transform the team into an "unfazed" unit.

కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఓటమా.?

Posted: 09/23/2019 05:30 PM IST
Virat kohli admits that india failed to read the tempo of the game

దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు పేలవంగా ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా, టీమిండియా ఓటమికి కెప్టెన్ కోహ్లీనే కారణమా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈమ్యాచ్ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం బెంగళూరులో వర్షం పడింది. దీంతో.. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా.. బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్‌కి ప్రయత్నించినా.. ఆశించిన విధంగా అడలేరు. కానీ.. విరాట్ కోహ్లీ సాహసోపేతంగా తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.

పిచ్‌ని సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో.. భారత జట్టు‌లో శిఖర్ ధావన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఈ స్టేడియంలో ఘనమైన రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లీ కూడా 15 బంతులాడినా కనీసం ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడంటే పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 134/9కి పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే 140/1తో దక్షిణాఫ్రికా ఛేదించేసింది.

అయితే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. జట్టుకి ఒత్తిడిని పరిచయం చేయాలనే ఆలోచనతో తాను ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పుకోచ్చాడు. వాస్తవానికి టీ20 టీమ్.. బుమ్రా, భువీ, చాహల్, కుల్దీప్ లేకపోవడంతో అనుభవలేమితో ఉంది. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం ద్వారా ఓటమితో యువ బౌలర్లు మరింత కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. మొత్తంగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles