Record stand sets up West Indies' big wlin over Ireland విండీస్ ఓపెనర్ల సంచలన వరల్డ్ రికార్డు..

Campbell and hope s record opening partnership hands west indies thumping win over ireland

Cricket news, Ireland vs West Indies, West Indies, Shai Hope, John Campbell, ireland, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

West Indies openers John Campbell and Shai Hope shattered the record for the highest first-wicket partnership in a one-day international with a stand of 365 as their side thrashed Ireland by 196 runs in Dublin

వరల్డ్ కప్ ముంగిట విండీస్ జట్టులో నూతనోత్తేజం..

Posted: 05/06/2019 08:44 PM IST
Campbell and hope s record opening partnership hands west indies thumping win over ireland

వన్డే వరల్డ్‌కప్ సమరానికి ముందు వెస్టిండీస్ జట్టులో నూతనోత్తేజం వచ్చింది. వెస్టిండీస్ జట్టు ఓపెనర్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. మొదటి వికెట్‌కు 365 భారీ భాగస్వామ్యం నెలకొల్పి నూతన అధ్యాయాన్ని లిఖించారు విండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్. బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్ ముక్కోణపు సిరీస్ లో భాగంగా డబ్లిన్‌లో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్లను చెండాడుతూ త్రిబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు.

గత ఏడాది జింబాబ్వేపై పాకిస్తాన్ ఓపెనర్లు ఫఖర్ జమాన్- ఇమాముల్ హక్ జోడించిన 304 పరుగుల రికార్డు భాగస్వామ్యం వెనకబడిపోయింది. 47.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడి... ఇంకో 17 బంతులు ఆడి ఉంటే తొలి ఇన్నింగ్స్ అంతా బ్యాటింగ్ చేసిన మొదటి ఓపెనింగ్ జోడిగా రికార్డు కూడా క్రియేట్ చేసేది. వన్డేల్లో ఒకేసారి 150 పైగా పరుగులు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా రికార్డు సొంతం చేసుకున్నారు ఓపెనర్లు.

క్యాంప్ బెల్ 137 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 179 పరుగులు సాధిస్తే, షాయ్ హోప్ 152 బంతులాడి 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 170 పరుగులు చేశాడు. ఓపెనింగ్‌లోనే కాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా వెస్టిండీస్ పేరిటే ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో కాన్‌బెర్రాలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై క్రిస్‌గేల్- మర్లోన్ శ్యామ్యూల్స్ కలిసి రెండో వికెట్‌కు అత్యధికంగా 372 పరుగులు జోడంచారు. ఇదే ఇప్పటిదాకా ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket news  Ireland vs West Indies  West Indies  Shai Hope  John Campbell  ireland  sports  cricket  

Other Articles