Chris Gayle named vice-captain for World Cup క్రిస్ గేల్ కు పదోన్నతి కల్పించిన విండీస్ బోర్డు

Chris gayle named west indies vice captain for world cup

Chris Gayle, Universe Boss, West Indies ODI team, Chris Gayle vice-captain, Jason Holder, World Cup 2019, Cricket World Cup 2019, 2019 Cricket World Cup, 2019 World Cup, Windies Cricket Board, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Chris Gayle has been named as the vice captain of West Indies for the upcoming World Cup slated to be held in England and Wales from May 30.

క్రిస్ గేల్ కు పదోన్నతి కల్పించిన విండీస్ బోర్డు

Posted: 05/07/2019 10:29 PM IST
Chris gayle named west indies vice captain for world cup

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కు ప్రమోషన్ లభించింది. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటానని, ఆతరువాత మాటమార్చి తాను కొనసాగుతున్నట్లు ప్రకటించిన గేల్ కు పదోన్నతి కల్పించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఏకంగా గేల్ ను ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా విండీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. జాసన్ హోల్డర్ కెప్టెన్ బాధ్యతలను నెరవేర్చనున్నాడు. మరోవైపు, ఈ ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డేలకు గేల్ గుడ్ బై చెప్పనున్నాడు.

ఈ సందర్భంగా 39 ఏళ్ల జమైకన్ క్రికెటర్ గేల్ మాట్లాడుతూ, ఏ ఫార్మాట్లో అయినా వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు. ఇక ప్రపంచకప్ అయితే మరీ ప్రత్యేకమని తెలిపాడు. కెప్టెన్ సహా జట్టులోని ఆటగాళ్లందరికీ సహకరించడం ఒక సీనియర్ ఆటగాడిగా తన బాధ్యత అని చెప్పాడు. త్వరలో జరగనున్న ప్రపంచకప్ అతి పెద్ద టోర్నీ అని... ఎన్నో అంచనాలు ఉన్నాయని... వెస్టిండీస్ ప్రజలు సంతోషించేలా, కప్ ను గెలుపొందేందుకు తమ వంతు ప్రయత్నాలను తాము చేస్తామని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles