No Place for Indian in Alastair Cook's Dream XI కుక్ డ్రీమ్ టీమ్ లో భారతీయులకు నో ఛాన్స్

No place for tendulkar dravid or any other indian in alastair cook s dream xi

AB de Villiers, alastair cook, alastair cook dream xi, Graham Gooch, Rahul Dravid, ricky ponting, Sachin tendulakar, India, England, India tour of England 2018, India vs England, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Outgoing England opener Alastair Cook has named his all-time Playing XI. With the exception of mentor Graham Gooch

కుక్ డ్రీమ్ టీమ్ లో భారతీయులకు నో ఛాన్స్

Posted: 09/05/2018 07:39 PM IST
No place for tendulkar dravid or any other indian in alastair cook s dream xi

ఇంగ్లాండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ ఇటీవలే తన రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో తన చివరి టెస్టును అడుతున్న ఆయన తన ఆల్ టైమ్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. తన 11 మంది సభ్యుల జాబితాలో కనీసం ఒక్క భారతీయ క్రీడాకారుడికి కూడా చోటు కల్పించకుండా చూసుకున్నాడు. యావత్ క్రికెట్ ప్రపంచం దేవుడిగా అభివర్ణించే లిటిల్ మాస్టార్ సచిన్ టెండుల్కర్ కు కానీ ది వాల్ రాహుల్ ద్రావిడ్ కు కానీ స్థానం కల్పించలేదు.

తన డ్రీమ్ జట్టుకు తన మార్గనిర్దేశకుడు, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రాహమ్‌ గూచ్ ను సారధిగా ఎంపిక చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ పోస్ట్‌ చేసింది. ‘గూచ్‌ నా కెప్టెన్‌, ఓపెనర్‌గా ఉంటాడు. అతడికి తోడుగా మాథ్యూ హెడెన్‌ (ఆస్ట్రేలియా) ఓపెనింగ్‌ దిగుతాడు. వీరిద్దరూ బంతి మెరుపును పోగొట్టి నా కోసం కొన్ని బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపిస్తారు. మిడిలార్డర్‌లో బ్రయన్‌ లారా (విండీస్‌), రికీ పాంటింగ్‌ (ఆసీస్‌), డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), జాక్వెస్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా)ను ఎంచుకుంటాను.

వారికిష్టమైన ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగుతారు. బౌలర్ల విషయానికి వస్తే ముత్తయ్య మురళీ ధరన్‌ (శ్రీలంక), షేన్‌ వార్న్‌ (ఆసీస్‌) స్పిన్నర్లు. జేమ్స్‌ అండర్సన్‌ (ఇంగ్లాండ్‌), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (ఆసీస్‌) పేస్‌ బౌలర్లు’ అని కుక్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌ తరఫున సుదీర్ఘ క్రికెట్‌ ఆడిన అలిస్టర్‌ కుక్‌ భారత్ తో జరిగే చివరి టెస్టు తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడు. 160 టెస్టుల్లో 44.88 సగటుతో అతడు 12,254 పరుగులు సాధించి ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alastair cook  dream xi  Graham Gooch  India tour of England 2018  India vs England  cricket  

Other Articles