‘please don't ban me': Virat Kohli ‘‘నాపై నిషేధం విధించకండీ..’’ రిఫరీని కోరిన విరాట్..

I am so sorry please don t ban me virat kohli on the finger incident

2012 India Australia Test series,India Australia 2012 Test series,India tour of Australia,India tour of Australia 2018,India vs Australia 2012 Sydney Test,Kohli flicking the finger,SCG Test,Virat Kohli, sports news,sports, latest sports news, cricket news, cricket

During the 2012 series in Australia, Kohli was caught on camera showing a middle finger to the Australian crowd, for which he had to beg in order to avoid what could have been a possible ban.

‘‘నాపై నిషేధం విధించకండీ..’’ రిఫరీని కోరిన విరాట్..

Posted: 09/05/2018 05:05 PM IST
I am so sorry please don t ban me virat kohli on the finger incident

టీమిండియా సారధి విరాట్‌ కోహ్లీ తన క్రికెట్‌ కెరీర్ ఒకానోక సందర్భంగా తనను క్షమించాలని, తనపై నిషేధం విధించరాదని కోరారు. ఔనా.? నిజమేనా.? ఎప్పుడు.. అని ఆలోచనలో పడ్డారా. కానీ ఇది నిజం. ఆ సంఘటనను తాజాగా విరాటుడు గుర్తుచేసుకున్నాడు. మధ్య వేలిని స్టేడియంలో ప్రేక్షకుల వైపు చూపించి కెమెరాలకు దొరికిపోయిన వైనాన్ని పంచుకున్నాడు. విజ్డన్‌ క్రికెట్‌ మాస పత్రికతో కోహ్లీ మాట్లాడుతూ 2012లో సిడ్నీ టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న వివాదం గురించి వివరించాడు.

టీమిండియా 2012లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. రెండో టెస్టు సిడ్నీలో జరిగింది. ఈ మ్యాచులో స్టేడియంలో స్థానిక ప్రేక్షకుల ప్రవర్తనతో చిరాకుపడ్డ కోహ్లీ ఓ దశలో వారివైపు మధ్య వేలిని చూపించి తన కోపాన్ని ప్రదర్శించాడు. విరాట్‌ ప్రవర్తను గమనించిన మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ అతన్ని తర్వాతి రోజు తన గదికి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో కోహ్లీ అక్కడికి వెళ్లాడు. ‘నిన్న బౌండరీ లైన్‌ వద్ద ఏం జరిగింది? అని రిఫరీ ప్రశ్నించాడు. దీనికి నేను ఏం జరగలేదు అని చెప్పేసరికి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను నా ముందుకు విసిరేశాడు.

అందులో నేను మధ్య వేలిని చూపిస్తున్న ఫొటో ఉంది. వెంటనే నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి అంటూ వేడుకున్నా. అతను మంచి వ్యక్తి. యుక్త వయస్సులో ఇవన్నీ సహజం అనుకొని నన్ను అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ ఈ ఘటనకు సంబంధించి ఓ ట్వీట్‌ కూడా చేశాడు. ‘క్రికెటర్లు అలా ప్రవర్తించొద్దన్న నియమాన్ని అంగీకరిస్తాను. అయితే ఆ గుంపులోంచి మన అమ్మ, సోదరి గురించి చెడుగా మాట్లాడితే ఏం చేయాలి? చాలా ఘోరమైన మాటలు విన్నా’ అంటూ ట్వీట్‌ పెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  fingergate  2012 sydney test  India  Australia  SCG Test  cricket  

Other Articles