ఇంగ్లాండ్ లో సుదర్ఘ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని వన్డే సిరీస్ ను మాత్రం చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదు టెస్టులతో సిరీస్ ప్రారంభం కాగానే తొలి టెస్టులో విజయావకాశాలు మెండుగా వున్నా.. రెండో ఇన్నింగ్స్ లో వికెట్లను పారేసుకోవడంలో పోటీపడిన విరాట్ సేన.. ప్రస్తుతం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండో టెస్టుకు సన్నదం అవుతుంది. అయితే ఈ స్టేడియం భారత్ కు పెద్దగా అనుకూలించని స్టేడియం అని అక్కడి గణంకాలు చెబుతున్నాయి.
టీమిండియా క్రికెట్ జట్టు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత టెస్టు క్రికెట్ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన 13 మందిలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో విజయాలను అందుకున్నారు. మొత్తంగా 17 మ్యాచులు లార్డ్స్ మైదానంలో అడగా ఇంగ్లాండ్ 11 మ్యాచులను గెలుచుకోగా, టీమిండియా కేవలం రెండు మాత్రమే గెలిచింది. కాగా నాలుగు మ్యాచులు డ్రా గా ముగిసాయి. దీంతో పరుగుల యంత్రంగా అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీ వంతు వచ్చేసరికి అభిమానులు అమితాసక్తిని కనబరుస్తున్నారు.
లార్డ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయ సారధిగా నిలుస్తారా.? రెండు విజయాలను అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిల సరసన చోటు సంపాదిస్తాడా.? లార్స్ లో విరాట్ సేనను విజయం వరిస్తుందా.? లేదా.? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లార్డ్స్ మైదానంలో విజయం సాధించి ఆ ఘనత సాధించిన మూడో సారథిగా కోహ్లీ తన పేరును నమోదు చేసుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తొలి టెస్టును ఓడిన విరాట్ సేన ఒత్తడిలో వుందని.. దీంతో లార్డ్స్ లో రాణించడం కష్టమన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.
లార్డ్స్ లో టీమిండియా టెస్ట్ రికార్డు:
మ్యాచ్‌లు: 17
టీమిండియా గెలిచినవి: 2
ఇంగ్లాండ్ గెలిచినవి: 11
డ్రా అయినవి: 4
1936: విజయనగరం మహారాజా (కెప్టెన్) - 9 వికెట్లతో ఓటమి
1946: పవడి సీనియర్ నవాబ్ (కెప్టెన్) - 10 వికెట్లు తేడాతో పరాజయం
1952: విజయ్ హజారే (కెప్టెన్) - 8 వికెట్ల తేడాతో ఓటమి
1959: పంకజ్ రాయ్ (కెప్టెన్) - 8 వికెట్ల తేడాతో ఓటమి
1967: MAK పటౌడీ (కెప్టెన్) - ఇన్నింగ్స్, 124 పరుగులతో పరాజయం
1971: అజిత్ వాడేకర్ (కెప్టెన్) - డ్రా
1974: అజిత్ వాడేకర్ (కెప్టెన్) - ఇన్నింగ్స్, 285 పరుగుల తేడాతో ఓటమి
1979: శ్రీనివాస్ వెంకటరాఘవన్ (కెప్టెన్) - డ్రా
1982: సునీల్ గవాస్కర్ (కెప్టెన్) - 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు
1986: కపిల్ దేవ్ (కెప్టెన్) - 5 వికెట్లు గెలుపొందాడు
1990: మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్) - 247 పరుగుల తేడాతో ఓడిపోయాడు
1996: మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్) - డ్రా
2002: సౌరవ్ గంగూలీ (కెప్టెన్) - 170 పరుగుల తేడాతో ఓడిపోయాడు
2007: రాహుల్ ద్రావిడ్ (కెప్టెన్) - డ్రాన్
2011: MS ధోనీ (కెప్టెన్) - 196 పరుగుల తేడాతో ఓడిపోయింది
2014: MS ధోనీ (కెప్టెన్) - 95 పరుగుల తేడాతో గెలిచారు
2018: విరాట్ కోహ్లీ (కెప్టెన్) - ???
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్... Read more
Jul 28 | వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more