India widen gap at the top of Test rankings ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేసులో టీమిండియా..!

Icc test rankings india stay at no 1 bangladesh go above the windies

Virat Kohli, Indian cricket team, ICC Test rankings, International Cricket Council, Australian national cricket team, South Africa national cricket team, Cricket, Virat Kohli, ICC Test team rankings, ICC Test rankings, ICC, Test Cricket, Cricket news, sports news, sports, Cricket

India have consolidated their position at the top of the International Cricket Council (ICC) Test Team Rankings following the annual update.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేసులో టీమిండియా..!

Posted: 05/01/2018 06:30 PM IST
Icc test rankings india stay at no 1 bangladesh go above the windies

అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం నిలబెట్టుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 125 రేటింగ్ పాయింట్లతో కోహ్లిసేన తొలి స్థానంలో నిలిచింది. 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. మే 1, 2018 నాటికి భారత్, దక్షిణాఫ్రికా మధ్య 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది. టీమిండియాను చేరుకోవాలంటే మిగతా జట్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది.

2014-15 ఏడాది ఫలితాలను పక్కనబెట్టి 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఐసీసీ ఈ వార్షిక ర్యాంకులను  ప్రకటించింది. ఇంతకుముందు ద్వితీయ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, టీమిండియాకు 4 పాయింట్లే తేడా ఉండగా.. తాజా ర్యాంకులతో ఆ వ్యత్యాసం 13 పాయింట్లకు పెరిగింది. సఫారీ జట్టు 5 పాయింట్లు కోల్పోయి 112 పాయింట్లకు పడిపోయింది. 106 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో 102 పాయింట్లతో న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌ బిజీలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. అనంతరం అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు..తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  ICC Test team rankings  ICC Test rankings  ICC  Test Cricket  Cricket  

Other Articles