Warner sends out good wishes to SRH వార్నర్ వీ మిస్ యూ: సన్ రైజర్స్

David warner sends out good wishes to sunrisers hyderabad

David Warner, ball-tampering scandal, Cricket Australia, CA, IPL 2018, IPL, Sunrisers Hyderabad, cricket, cricket news, sports news, latest sports news, sports

David Warner, who was banned for a year from playing international cricket and the Indian Premier League, wished Sunrisers Hyderabad luck ahead of their IPL 2018 opener against Rajasthan Royals.

వార్నర్ వీ మిస్ యూ: సన్ రైజర్స్

Posted: 04/09/2018 05:22 PM IST
David warner sends out good wishes to sunrisers hyderabad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ తొలి మ్యాచ్ ను అడనుంది. అయితే ఈ జట్టు సారథ్య బాధ్యతలను ఇన్నాళ్లు చేపట్టిన డేవిడ్ వార్నర్.. ఈ సారి జట్టుకు దూరమైన నేపథ్యంలో తన జట్టు బృందానికి మంచి సందేశం పంపించాడు. తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ ఎనమిది గంటలకు హైదరాబాదులోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ బాగా అడాలని విజయాన్ని అందుకోవాలని కాంక్షిస్తూ.. డేవిడ్ వార్నర్ ఈ సందేశాన్ని తన సామాజిక మాద్యమం ద్వారా పోస్టు చేశాడు.

డేవిడ్ వార్నర్‌ని ఐపీఎల్ నుంచి బహిష్కరించడంతో ఈసారి కేన్ విలియమ్‌సన్ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్‌కి జట్టులో చోటు కల్పించారు. అయితే ఐపీఎల్ కి దూరమైన వార్నర్ మనసు మొత్తం హైదరాబాద్ జట్టు మీదే ఉంది. సన్‌రైజర్స్ జెర్సీ అవిష్కరణ కార్యక్రమాన్ని ఇన్‌ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు. అక్కడ డేవిడ్ వార్నర్ తన తోటి క్రికెటర్లకు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్ చేశాడు. అంతేకాక.. ఐపీఎల్ చూసేందుకు ఇండియా వస్తానని పేర్కొన్నాడు.

తాజాగా హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ వార్నర్ ట్వీట్ చేశాడు. ‘‘గుడ్ లక్ టు మై ఫ్రెండ్స్ సన్ రైజర్స్.. ఈ రాత్రి మంచిగా ఆడండి’’ అంటూ సన్ రైజర్స్‌కి వార్నర్ తన సందేశాన్ని అందించాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ‘వి మిస్ యూ వార్నర్‌’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వార్నర్ సారథ్యంలో 2016 ఐపీఎల్ లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. అయితే సౌతాఫ్రికాలో జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా వార్నర్‌, స్మిత్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా బహిష్కరించడంతో వాళ్లను ఐపీఎల్ నుంచి కూడా నిషేధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Warner  ball-tampering scandal  Cricket Australia  IPL 2018  Sunrisers Hyderabad  cricket  

Other Articles