safari Pacers reduce India to 28/3 సఫారీలను కట్టడి చేసింది.. కానీ టమీండియా కూడా..

India vs south africa 1st test day 1 pacers reduce india to 28 3

India vs South Africa 2018,India vs South Africa,Virat Kohli,Jasprit Bumrah,Hashim Amla,Dean Elgar,Cricket news,Cape Town Test,Bhuvneshwar Kumar, sports news, sports, cricket news, cricket

South africa bowlers have given early bragging rights with the wickets of India openers and the prized scalp of captain Virat Kohli after South Africa were 286 all out in their first innings.

సఫారీలను కట్టడి చేసింది.. కానీ టీమిండియా కూడా..

Posted: 01/05/2018 09:42 PM IST
India vs south africa 1st test day 1 pacers reduce india to 28 3

దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు కట్టడి చేసి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు.. సఫారీ బౌలర్లు షాకిచ్చారు. టాప్‌ ఆర్డర్‌ ముగ్గురు ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు వరస కట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.

భారత్‌ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా(5), రోహిత్‌ శర్మ(0) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌(65), డుప్లెసిస్‌(62) అర్ధశతకాలతో రాణించారు. తొలి ఓవర్‌ వేసిన ఫిలాండర్‌ బౌలింగ్‌లో భారత ఓపెనర్‌ ధావన్‌ రెండు ఫోర్లు బాది మంచి జోరుమీదున్నట్లు కనిపించాడు.

అయితే ఫిలాండర్‌ వేసిన నాలుగో ఓవర్లో మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌(1: 17బంతుల్లో) ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. స్టెయిన్‌ వేసిన తర్వాతి ఓవర్లో శిఖర్‌ ధావన్‌(16).. మోర్నీ మోర్కెల్‌(9వ) బౌలింగ్‌లో కోహ్లి(5) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖరి రెండు ఓవర్లలో ఆచితూచి ఆడి మరో వికెట్‌ పడకుండా రోహిత్‌ శర్మ, పుజారా జాగ్రత్త పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles