Kumble resignation is a right decision says azharuddin అత్మాభిమానం వున్న వ్యక్తి చేసే పనే అది: అజార్

Anil kumble resignation for head coach is a right decision says azharuddin

anil kumble, Mohammad Azharuddin, coach anil kumble, india cricket coach, bcci, virat kohli, team india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket, latest sports news, sports news, sports, cricket news, cricket

Former India captain Mohammad Azharuddin has come out in support of his former teammate Anil Kumble, calling his decision to quit from the position of the Indian cricket team's coach as the right choice.

అత్మాభిమానం వున్న వ్యక్తి చేసే పనే అది: అజార్

Posted: 08/11/2017 07:03 PM IST
Anil kumble resignation for head coach is a right decision says azharuddin

టీమిండియా క్రికెట్ ప్రధాన కోచ్ పదవిలో ఒక్క ఏడాది పాటు కొనసాగి.. తన పదవిని పోడిగింపు విషయంలో బిసిసిఐ నాన్చుడు ధోరణి అవలంభించడంతో తనకు తానుగానే పదవి నుంచి వైదొలిగిన నాటి దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లేకు మద్దతుగా అనేక మంది క్రికెటర్లు నిలిచారు. కోచ్ గా సేవలందించిన కుంబ్లేను విషయాన్ని బిసిసిఐ మరింత గౌరవంగా పంపించాల్సిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. కుంబ్లే లాంటి దిగ్గజానికి ఇలా పరాభవం కలిగించేలా చేయాల్సింది కాదని కూడా అభిప్రాయపడ్డారు.

తాజాగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కూడా కుంబ్లేకు మద్దతుగా నిలిచాడు. టీమిండియాను జట్టును గత ఏడాది కాలంగా విజయాల బాట పట్టడంతో తీర్చిదిద్దిన కుంబ్లేకు బిసిసిఐ సరైన గౌరవాన్ని అందించలేదని విమర్శించారు. అలాంటి సమయంలో క్రికెట్ కోచ్ పదవికి ఆయన వీడ్కోలు పలికి సరైన నిర్ణయం తీసుకున్నాడని అజహర్ అన్నారు. ఈ పదవి నుంచి కుంబ్లే అర్థాంతరంగా వైదొలగడానికి అతను ఆత్మభిమానాన్ని చంపుకుని పని చేయడం ఇష్టలేకపోవడమే ప్రధాన కారణం కావొచ్చన్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బిసిసిఐ వైఖరే ఆయన తన పదవిని కాదనుకుని వెళ్లేలా చేశాయని పేర్కోన్నాడు, అనిల్ కుంబ్లే ఆత్మాభిమానం వున్న వ్యక్తని.. తన కోచ్ పదవి విషయంలో సంయమనం పాటించి వారం రోజుల పాటు మౌనంగా వున్నాడని, అయినా అతని బిసిసిఐ నాన్చుడు ధోరణి ఆయనకు విసుగు తెప్పించిందని అందువల్లే తనకు తానుగా పదవిని వదులుకున్నాడని చెప్పాడు. అయితే కుంబ్లే అలా తప్పుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకోచ్చాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం కల్గిన అతనికి ఈ విధంగా జరిగి ఉండకూడదు. కుంబ్లేది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని అజార్ వ్యాఖ్యానించాడు. కుంబ్లే తీసుకున్న నిర్ణయం సరైనదేనని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  Mohammad Azharuddin  cricket Coach  team India  anil kumble  virat kohli  bcci  cricket  

Other Articles