స్పిన్నర్లకు కలసిరాని వేదికపైనే తుది సమరం..! 'Dharamsala Will Assist Pacers', India on Backfoot

Pacers will have an advantage on dharamsala pitch says curator

dharamsala test, dharamsala cricket ground, dharamsala pitch, pitch curator dharamsala, india australia test series, dharamsala test schedule, anil kumble, india vs australia 2017, india vs australia test 2017, ind vs aus, ind vs aus test

Chief curator Sunil Chauhan, stated that the true character of a batsman will be revealed when they bat on the Dharamsala pitch.

స్పిన్నర్లకు కలసిరాని వేదికపైనే తుది సమరం..!

Posted: 03/23/2017 08:04 PM IST
Pacers will have an advantage on dharamsala pitch says curator

భారత్ అస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో తుదిపోరుకు రంగం సిద్దమైంది. హిమాచల్ ప్రదేశ్ వేదికగా ధర్మశాల స్టేడియంలో జరగనున్న తుది సమరంలో బ్యాట్స్ మెన్ల అసలైన ప్రతిభ బయట పడుతుందని అంటున్నారు పిచ్ క్యూరేటర్ సునీల్ చౌహాన్. ఆటగాళ్లలోని ప్రతిభా పాటవాల ప్రదర్శనకు కొలమానంగా తమ ధర్మశాల పిచ్ నిలుస్తుందని అంటున్నారాయన. నాలుగు టెస్టు సిరీస్ లలో మూడు మ్యాచ్ లు జరుగగా ఒక్క టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా, ఇరు జట్టు 1- 1తో సమంగా వున్న విషయం తెలిసిందే.

అయితే ఈ పిచ్ భారత్ లోని అన్ని పిచ్ లకు భిన్నంగా వుంటుందని, అన్ని పిచ్ లు స్పీన్నర్లకు అనుకూలంగా వుంటే ఈ పిచ్ మాత్రం పేసర్లకు అనుకూలంగా వుంటుందని క్యూరేటర్ తెలిపారు. తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలంగా వుండగా, ఆ తరువాత మూడు రోజులు మాత్రం బ్యాట్స మెన్లకు, స్నిన్నర్లకు కలసివస్తుందని అన్నారు. ఈ రకంగా పిచ్ ను తయారు చేసేందుక ప్రతీ ఏడాది తాము పిచ్ పోరపై వున్న సాయల్ ను తీసి మరో సాయిల్ తో దానిని రీప్లేస్ చేస్తామని అన్నారు.

కాగా స్పీన్నర్లకు అనుకూలంగా వుండే ఈ పిచ్ అసీస్ పేసర్లకు అనుకూలంగా మారుతుందని, దీంతో ఈ టెస్టులో తాము గెలిచి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకంటామని అసీస్ అటగాళ్లు అశాభావం వ్యక్తం చేస్తుండగా, ఇటు జట్టు రాణించడంలో బ్యాట్స్ మెన్లతో పాటు బౌలర్లు ప్రతిభ కూడా పూర్తిగా వుంటుందని, ఈ క్రమంలో తమ జట్టులో వున్న టీమ్ స్పిరిట్, గెలవాలన్న అకాంక్ష తమను విజయతీరాలకు చేర్చుతుందని టీమిండియా వర్గాలు కూడా అశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తుది సమరంలో గెలుపెవరిదన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  virat kohli  australia  teamindia  sunil chowhan  dharmashala test  cricket  

Other Articles