అస్ట్రేలియా క్రికెట్ జాత్యాహంకారం.. ఇదోరకం.. James Sutherland ribs Kohli over DRS accusations

Cricket australia chief james sutherland takes a dig at virat kohli

india vs australia, steve smith, virat kohli, cricket australia, james sutherland, Team India, india australia bangalore test, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Cricket Australia chief James Sutherland took a light-hearted jibe at Virat Kohli, sarcastically implying that the India captain does not know how to apologise.

అస్ట్రేలియా క్రికెట్ జాత్యాహంకారం.. ఇదోరకం..

Posted: 03/23/2017 06:41 PM IST
Cricket australia chief james sutherland takes a dig at virat kohli

చక్కని స్పోటివ్ స్పిరిట్ తో అడుతున్న క్రికెట్ లోకి జాత్యాహంకారం కూడా ప్రవేశించింది. తాము చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే.. అదో రకమైన జాత్యాహంకార వ్యాఖ్యలకు దిగుతూ అవతల జట్టు క్రికెటర్లను టార్గెట్ చేయడం సబబు కాదన్న విషయం కూడా క్రికెట్ బోర్డు ఛీప్ లకు కూడా తెలియకపోవడం దారుణం. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా తీరు కూడా అలాగే వుంది. తమ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ ఆ దేశ బోర్డు చీఫ్ రంగంలోకి దిగి దారుణ వ్యాఖ్యలకు పాల్పడింది.

బెంగళూరు టెస్టులో డీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావించిన జేమ్స్ సూధర్ లాండ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారీ అన్న పదమే తెలియదని ఎద్దేవా చేశారు. సద్దుమణుగుతున్న ఈ విషయాన్ని మళ్లీ రేపిన ఆయన తమ జట్టు కెప్టెన్ ను వెనకేసుకువచ్చారు. డీఆర్ఎస్ ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి తెలుసుకోమ్మని ఆయనే స్మీత్ కు సలహా ఇచ్చినట్లుంది ఆయన వాలకం చూస్తే. అది చాలదన్నట్లు టీమిండియా కెప్టెన్ పై రుసరుసలాడారు.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి 'సారీ' అనే పదాన్ని ఉచ్చరించడం తెలియదేమో అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. తప్పు చేసినవారికి వెనకేసుకువచ్చి.. అది తప్పు అని అరచిన వారిన సారీ చేప్పాలనడమే క్రికెట్ అస్ట్రేలియా తత్వంగా మార్చుకున్నట్లుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన సదర్లాండ్, సారీ అన్న పదం ఉందన్న విషయం తెలియదని ఎద్దేవా చేశాడు. దీనిపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఛీటర్ ను ఛీటర్ అని అనక ఇంకేమంటారని ప్రశ్నిస్తున్నారు.  ముందు స్మీత్ చేత సారీ చేప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles