పెద్ద గ్రౌండ్లలో స్పిన్నర్ల అట మాజా తెస్తుంది Chahal: You can flight the ball on big grounds

Yuzvendra chahal wants india to cash in on england s aggression

india vs england, ind vs eng, india vs england t20 series, india vs england second t20, india vs england chahal, yuzvendra chahal, cricket news, sports news

Yuzvendra Chahal said big grounds like the one at the VCA Stadium in Jamtha provides him with a chance to use flighted deliveries more in order to create a deception in the minds of the batsmen.

పెద్ద గ్రౌండ్లలో స్పిన్నర్ల అట మాజా తెస్తుంది

Posted: 01/28/2017 07:59 PM IST
Yuzvendra chahal wants india to cash in on england s aggression

యుజ్వేంద్ర చాహల్..హరియాణాకు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ ప్రస్తుత భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 19 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచిన చాహల్.. అదే ఏడాది  జూన్లో భారత వన్డే జట్టులో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో  జరగుతున్న మూడు ట్వంటీ 20ల సిరీస్లో సభ్యుడైన చాహల్.. తొలి మ్యాచ్లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే రేపటి రెండో  ట్వంటీ20లో మరింతగా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

నగరంలోని వీసీఏ స్టేడియం పెద్దగా ఉండటం తనకు కచ్చితంగా కలిసొస్తుందన్నాడు. స్పిన్నర్లకు ప్రధాన ఆయుధమైన ఫ్లెటెడ్ డెలివరీల అస్త్రాలను రెండో ట్వంటీ 20లో ఉపయోగిస్తానన్నాడు. 'జమ్తాలోని వీసీఏ స్టేడియం నాకు లాభిస్తుందనే అనుకుంటున్నా. గ్రౌండ్ పెద్దది కావడంతో గాల్లోనే బంతిని స్పిన్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పెద్ద గ్రౌండ్లో ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. బంతిని మనం ఫైట్ చేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. బౌండరీ లైన్ పెద్దదిగా ఉంటే ఫ్లెటెడ్ డెలివరీలతో బ్యాట్స్మెన్ను ఊరించి మరీ వికెట్లు తీయొచ్చు'అని చాహల్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spinners  Yuzvendra Chahal  india  england  big grounds  cricket  

Other Articles