ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కెరీర్ లోనే కిలక మలుపు Kedar Jadhav wants to represent India in all formats

Series against england turning point of my career kedar jadhav

India vs England, Kedar Jadhav, England, odi series, India, turning point, career, India national cricket team, England cricket team, Cricket score

Kedar Jadhav became an overnight star after his match-winning knock against England in Pune and went on to win 'man of the series' award.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కెరీర్ లోనే కిలక మలుపు

Posted: 01/28/2017 07:29 PM IST
Series against england turning point of my career kedar jadhav

ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మ్యాన్ అప్ ది సిరీస్ కు ఎన్నికైన యువ క్రికెటర్ కేదర్ జాదవ్. పుణెలో జరిగిన తొలి వన్డేలో 76 బంతుల్లో 120 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాదవ్.. ఈ వన్డే సిరీస్ తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ తరువాత తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకుంటానని ముందే అనుకున్నట్లు చెప్పుకోచ్చాడు.

ఆ తరువాత అడిన మిగిలిన రెండు వన్డేల్లో కూడా రాణించడంతో అనుకున్నట్లుగానే మ్యాచ్ అప్ ధి సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నాలో విశ్వాసాన్ని పెంచితే, ఇది నా కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిందని జాదవ్ తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో భారీ పరుగులు సాధించలేకపోయినప్పటికీ, తనలోని ఆత్మవిశ్వాసం బలపడటానికి కారణమైందన్నాడు.

తనకు ఆలస్యంగా అవకాశాలు రావడం వల్ల జాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. గతంలో తాను తగినంత పరిణితి చెందకపోవడం వల్లే అవకాశాలు రాలేదన్నాడు. ఈ కారణం చేతనే తనకు జాతీయ జట్టులో అవకాశాలు ఆలస్యంగా వచ్చాయన్నాడు.తనకు అవకాశాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ సంతోషంగా ఉన్నట్లు జాదవ్ తెలిపాడు. ప్రస్తుత అవకాశాల్ని  తనకు అనుకూలంగా మార్చుకుంటాననే ఆశాభవం జాదవ్ వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  one day series  kedar jadhav  team india  england  cricket  

Other Articles