రోజు రోజుకు తన అటలోని మాధుర్యాన్ని అస్వాధిస్తూ.. మరింత మెరుగుపర్చుకుంటూ ప్రపంచ రికార్డులను కూడా తిరగరాసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇప్పటికే ప్రపంచ దిగ్గజాల ప్రశంసల్ని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందుకుంటున్నా.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం కోహ్లిని అభినందించిన ఘటనలు చాలా అరుదు. అయితే ఇప్పుడు ఒకేసారి ముగ్గురు పాక్ దిగ్గజ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసలు వర్షం కురిపించారు. అసలు కోహ్లిని అభినందించడానికి పదాలే లేవంటూ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్‌లు ఒకేసారి గళం విప్పారు. విరాట్ కోహ్లి ఆటను పాకిస్తాన్ యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలంటూ ఈ దిగ్గజ త్రయం స్పష్టం చేసింది.
'ఒక మంచి ఉత్సాహభరితమైన క్రికెటర్ కోహ్లి. అటు జిమ్‌లోనూ, ఇటు బయట కూడా విరాట్ కు అతనే సాటి. కఠినమైన శారీరక వ్యాయామం చేస్తూ ఆహార నియమాల్లో అత్యంత నియమంగా ఉండటం విరాట్ కే చెల్లింది. విరాట్ ఫామ్ వెనుక విపరీతమైన కృషి ఉంది'అని సక్లయిన్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లితో పాటు భారత యువ ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటానికి వారు సీనియర్లు సలహాల్ని బాగా వంట బట్టించుకుంటారు.
ప్రతీరోజు సునీల్ గవాస్కర్ యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. పాక్ క్రికెట్ జట్టులో అది లేదు. ఏ క్రికెటర్ కూడా సీనియర్ సలహాల్ని తీసుకోడు. దాంతో పాటు మా ఆటగాళ్లు ఫిట్ నెస్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టరు' అని అక్రమ్ పేర్కొన్నాడు.'ప్రపంచక్రికెట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్నవిరాట్ కోహ్లిని పాక్ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు. కోహ్లి ఆటను వర్ణంచడానికి పదాలే సరిపోవడం లేదని అక్తర్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more