కోహ్లీకి ఎవరు సాటిలేరు.. రారు.. ఫాన్ క్లబ్ లో చేరిన పీటర్సన్ Unfair to even compare Virat Kohli with Joe Root, feels Kevin Pietersen

Joe root is good but virat kohli is phenomenal says kevin pietersen

virat kohli, kohli, joe root, root, kevin pietersen, pietersen, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Virat Kohli has often being compared with England batsman Joe Root, which Kevin Pieterson feels isn't a fair comparison.

కోహ్లీకి ఎవరు సాటిలేరు.. రారు.. ఫాన్ క్లబ్ లో చేరిన పీటర్సన్

Posted: 11/04/2016 05:47 PM IST
Joe root is good but virat kohli is phenomenal says kevin pietersen

క్రికెట్ ప్రపంచంలో సహచర ఆటగాళ్ల నుంచి విదేశీ అటగాళ్లు, మాజీ దిగ్గజాలతో పాటు అభిమానుల ప్రశంసలను అందుకుని ముందుకు సాగిపోతున్న క్రికెట్ ఎవరో తెలుసా..? అయన మరెవరో కాదు టీమిండియ టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఒక్క ఫార్మెట్ లో కాకుండా మూడు రకాల ఫార్మెట్లలో బాగా రాణించడంతో పాటు ప్రముఖల ప్రశంసలను కూడా అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా కోహ్లీ ఫాన్ క్లబ్ లో చేరిపోయాడు.

సుధీర్ఘ భారత పర్యటనకు తమ జట్టు వచ్చిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి సాటి ఎవరూ లేరని, ప్రస్తుతం ఆయనకు తానే సాటని పేర్కోన్నాడు. విరాట్ సాధించిన ఘనతలే అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయని కొనియాడాడు. ఇదే క్రమంలో ఇంగ్లండ్ ఆశా కిరణం జో రూట్తో విరాట్ కోహ్లీని పోల్చడాన్ని పీటర్సన్ తప్పుబట్టాడు. విరాట్తో జోరూట్ను పోల్చడం అంత సబబు కాదన్నాడు.

విరాట్ సాధించిన ఘనతలు అతని గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి. సందేహం లేకుండా జో రూట్ ఒక మంచి ఆటగాడేనని అంగీకరిస్తూనే.. అతన్ని విరాట్ లో పోల్చడం సరికాదన్నాడు. జట్టు తరపున రూట్ కొన్ని కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడని, కానీ కోహ్లీతో పాల్చడానికి ఇది సమయం కాదన్నాడు. విరాట్ అసాధారణమైన గణాంకాలతో చాలా ముందంజలో ఉన్నాడు. జట్టు కోసం తరచు భారీ స్కోర్లు నమోదు చేస్తూ అసాధారణమైన ఆట తీరును కనబరుస్తున్నాడు.  ఈ రకంగా చూస్తే విరాట్ తో రూట్ పోలిక ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'అని పీటర్సన్ తెలిపాడు.

త్వరలో భారత జట్టుతో ఇంగ్లండ్ ఆడబోయే సుదీర్ఘ టెస్టు సిరీస్లో రవి చంద్రన్ అశ్విన్ నుంచి ప్రమాదం పొంచి వుందని జట్టును హెచ్చరించాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అశ్విన్ సొంతమనే విషయాన్ని మరచిపోకుండా జాగ్రత్తగా ఆడాలన్నాడు.'నేను అశ్విన్ చాలాసార్లు ఎదుర్కొన్నాను. నాకైతే అతని దూస్రా ఓకే.ఒకవేళ అతను దూస్రా ప్రయోగించకుండా వేరే అస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రం ఇంగ్లండ్కు ఇబ్బందులు తప్పవు' అని పీటర్సన్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevin Pietersen  India vs england  Team india  test series  joe root  

Other Articles