ఆ విషయం నేను చాలా అలస్యంగా గ్రహించా Test cricket the most disciplined thing I will do' - Pandya

Test cricket the most disciplined thing i will do pandya

Anil Kumble, Cricket, England, England in India 2016, England vs India, India, India vs England, Sourav Ganguly, Test cricket, hardik pandya, Virat Kohli, Wriddhiman Saha, Test cricket, Indian cricket, England cricket, cricket, cricket news, sports, sports news

The India A tour helped bring his career back into stride after a disappointing IPL. "I remember that clearly," Pandya tells media, hours after his maiden call-up to the India Test squad.

ఆ విషయం నేను చాలా అలస్యంగా గ్రహించా

Posted: 11/03/2016 06:53 PM IST
Test cricket the most disciplined thing i will do pandya

టెస్టు క్రికెట్ అనేది పూర్తి నిబద్ధత కూడిన ఆట అనే విషయం తాను చాలా అలస్యంగా గ్రహించానని తొలిసారి భారత జాతీయ క్రికెట్ టెస్టు జట్టులో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. తమకు భారత ఏ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పిన విషయాలు తనను తాను నిరూపించుకునేందుకు దోహదపడ్డాయన్నాడు. అదే విజయం తాను ఇప్పడు తొలిసారిగా జాతీయ క్రికెట్ టెస్టు జట్లులో స్థానం దక్కేలా చేశాయని అన్నారు. సెప్టెంబర్లో భారత -ఎ జట్టు చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటనే తన కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణమైందని అభిప్రాయపడ్డాడు.  ఆ పర్యటన ద్వారా తాను అనేక విషయాలను నేర్చుకున్నట్లు తెలిపాడు.

ప్రతీ ఆటగాడు సహజసిద్ధమైన ఆటనే ఆడాలని, దీంతో పాటు జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా అడాలన్నదే రాహుల్ తమకు చెప్పాడని, అయితే ఈ విషయాలను తాను అలస్యంగా గ్రహించానన్నాడు. ప్రతీ మ్యాచ్ లో తాను రాణించాలనుకుని.. సరైన ప్రదర్శన చేయలేకపోయానన్నాడు. ఇక చివరి మ్యాచ్లో తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కడంతో తనకు తానే చెప్పుకుని స్పెషల్ ఇన్నింగ్స్ ఆడానని.. అదే ఇప్పుడు తనను టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసిందన్నాడు.
 
భారత-ఎ జట్టు 46 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తానే కీలక బ్యాట్స్ మెన్ అని గ్రహించి నిదానంగా రాణించానని, అయితే ఆస్ట్రేలియన్లు తనను కూడా ప్రధానంగా టార్గెట్ చేశారన్నాడు. అయితే వారి వ్యూహాలను తిప్పికోడుతూ హాఫ్ సెంచరీ చేశానన్నాడు. అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది. ప్రస్తుతం తాను చాలా క్లియర్గా ఉన్నానని.. ఎప్పుడు ఏమి చేయాలి అనే దానిపై పూర్తి స్పష్టత వచ్చిందన్నాడు ఇంగ్లండ్తో సిరీస్లో అది కచ్చితంగా అమలు చేస్తా' అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  ms dhoni  test series  hardik pandya  cricket  

Other Articles