విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ కెప్టెన్లలో ఒకరు: గంగూలీ Kohli has done wonders for the country, says Ganguly

Kohli has done wonders for the country says ganguly

virat kohli, virat kohli india, india virat kohli, kohli india, india vs new zealand, sourav ganguly, ganguly, cricket news, cricket

India will kick off their home season against New Zealand with three Tests as they go onto play 13 Tests against Australia, England and Bangladesh.

విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ కెప్టెన్లలో ఒకరు: గంగూలీ

Posted: 09/16/2016 06:57 PM IST
Kohli has done wonders for the country says ganguly

నిరాశ చెందినా పోరాటం ఆపను, నన్ను లక్ష్యం చేసుకుని పక్కన పెట్టినా భయపడేంత పిరికివాడిని కాదు, జట్టులో చోటు లభించకపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు, నా సహచరుడు గెలిచినట్టు కాదు... నేను పోరాడుతాను, పోరాడుతాను' అంటూ ట్వీట్ చేసింది ఎవరో తెలుసుగా, దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్. న్యూజీలాండ్ తో టెస్టు మ్యాచ్ ల సందర్భంగా తనను టీమిండియా జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఆయన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కాసింత రియాక్ట్ అయ్యాడు,

అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కొనసాగుతన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. తన ఫేవరెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడంటూ గంగూలీ కితాబిచ్చాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడని పేర్కొన్న ‘దాదా’ అతి తక్కువ సమయంలోనే దేశానికి ఎన్నో అద్భుతాలు అందించాడని కొనియాడాడు. మైదానంలో పోరాట స్ఫూర్తితో కనిపించే కోహ్లీ భారత్ క్రికెట్ విలువను అమాంతం పెంచేశాడని పేర్కొన్నాడు.

భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి కోహ్లీ అంటూ ఆకాశానికెత్తేశాడు. విజయకాంక్షతో రగిలిపోయే విరాట్ దేశానికి ఎంతో అవసరమైన క్రికెటర్ అని గంగూలీ పేర్కొన్నాడు. ఈ నెలలో మొదలుకానున్న భారత్-కివీస్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఇంగ్లండ్ తర్వాత న్యూజిలాండ్ జట్టే రెండో అత్యుత్తమమైన జట్టని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కంటే స్పిన్నర్లను బాగా ఎదుర్కొనే కివీస్‌తో జాగ్రత్తగా ఉండాలని టీమిండియాను హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  virat kohli  India  New Zealand  Cricket  

Other Articles