టీమిండియాపై విజయానికి సహనం కావాలి Patience needed for success in India says Graeme Hick

Patience needed for success in india says graeme hick

team india, Australia, virat kohli, Graeme Hick, australia coach, india australia, india australia series, india vs australia, Australian batting coach Graeme Hick, Indian pitches, sub-continent pitches, Australian batsmen,cricket, Test cricket, international, sports, sports news, cricket, cricket news

Australia batting coach Graeme Hick feels that team’s premier batsmen would have to “show more patience” and adaptability when they tour India early next year.

టీమిండియాపై విజయానికి సహనం కావాలి

Posted: 09/16/2016 08:07 PM IST
Patience needed for success in india says graeme hick

వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో పర్యటించనున్నఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ జట్లలో భారత్ కఠినమైన ప్రత్యర్థి అనే సంగతిని గుర్త్తించుకుని పూర్తిస్థాయి ప్రదర్శన ఇస్తేనే అక్కడ రాణిస్తామన్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఆసీస్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో హిక్ సమావేశమయ్యాడు.

'భారత్లో ఆడేటప్పుడు ముందుగా అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. అదే సమయంలో భారత్పై ఎదురుదాడికి దిగడం ముఖ్యమే. ఎప్పుడూ రన్ రేట్ను కాపాడుకుంటూ ఆటను కొనసాగించాలి. ఇందుకోసం చాలా ఓపిక అవసరం. ఇటీవల కాలంలో భారత్లో పర్యటించిన కొన్ని జట్లు ఇలా చేసే విజయవంతమయ్యాయి. భారత్తో పోరు అంత సులభం కాదన్న సంగతి ప్రతీ ఆటగాడు మదిలో ఉండాలి. ఆసీస్ జట్టులో ప్రతిభకు లోటు లేదు. కాకపోతే గత కొంతకాలంగా ఆసీస్ జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలి. అందుకోసం సాధ్యమైనంత ఓపికతో ఆడాల్సి అవసరం ఉంది' అని హిక్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  Australia  virat kohli  Graeme Hick  australia coach  cricket  

Other Articles