Eden Gardens set to host India’s first pink ball match

Eden gardens to host india s first pink ball match

india pink ball, india pink ball test, pink ball in test metch, sourav ganguly, bcci, bcci news, ganguly, cricket association of bengal, pink ball test, anurag thakur, sports news, sports, cricket news, cricket

The BCCI technical committee has already put forward the proposal to play the Duleep Trophy matches in the coming season with under lights.

పింక్ బాల్ తొలి మ్యాచ్ కు అతిథ్యమివ్వనున్న ఈడెన్

Posted: 06/08/2016 05:58 PM IST
Eden gardens to host india s first pink ball match

పింక్ బాల్ (గులాబి బంతి) ప్రస్తావన రాగానే డే నైట్ టెస్టు మ్యాచ్ కూడా క్రికెట్ అభిమానులకు ఠక్కున గుర్తుకువస్తుంది. పింక్ బాల్ ప్రయోగాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లోనే ప్రయోగించాలని భావిస్తున్నారు క్రికెట్ అసోసియేషన్ అఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇందుకు అనుగూణంగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటూ చకచకా పనులు గావిస్తున్నారు. ఈ నెలలోనే ఈడెన్ లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్దం చేశారు.

దీంతో దేశంలో తొలిసారి గులాబీ బంతితో ఆడే మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్ అతిధ్యమివ్వనుంది. ఈ నెల 17 నుంచి 20 వరకు క్యాబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని, సమీప భవిష్యత్‌లో  డే అండ్ నైట్ టెస్టు నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు గంగూలీ తెలిపారు. బోర్డు సాంకేతిక కమిటీ అధ్యక్షుడిగానూ దాదా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Day-night Test match  BCCI  Pink ball  Cab  eden gardens  

Other Articles