A coach for Pakistan cricket team is waste of money says former cricketer Abdul Qadir

Having a coach in cricket is a waste of money says abdul qadir

Abdul Qadir,pakistan, pakistan cricket news, pakistan cricket, pakistan cricket team, abdul qadir pakistan, abdul qadir bowling, pcb, pakistan coach, abdul qadir wickets, sports news, sports, pakistan cricket board, cricket news, cricket

Abdul Qadir advised the PCB to give total powers to the captain and appoint a manager with him who has a strong cricket background.

అంతర్జాతీయ క్రికెట్ లో కోచ్ల తో పని ఏంటీ.?

Posted: 04/25/2016 12:04 PM IST
Having a coach in cricket is a waste of money says abdul qadir

జాతీయ క్రికెట్ జట్లకు కోచ్ లతో ఏం పని అంటూ నిగ్గదీసి అడిగారు పాకిస్థాన్ మాజీ స్పిన్ మాంత్రికుడు అబ్దుల్ ఖాదిర్. జాతీయ క్రికెట్ జట్లకు కోచ్లను నియమించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చిపారేశాడు. అసలు క్రికెట్ కోచ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు వృథా కావడమే తప్పితే  ప్రయోజనం శూన్యమైన్నాడు.  ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గ్రహించి కోచ్ ల నియమించాలన్న  నిబంధనను తొలగించడం ఉత్తమమని పేర్కోన్నాడు.

'పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదే నా సలహా. చీఫ్ కోచ్ నియమాకానికి చరమగీతం పాడండి.  దానివల్ల ధనంతో పాటు శక్తి కూడా ఆదా అవుతుంది. ఒక పాకిస్తానే కాదు.. మిగతా దేశాల క్రికెట్ జట్లు కూడా కోచ్ల వల్ల సాధించేదేమీ లేదు. కోచ్లను ప్రమోట్ చేసే విధానాన్ని కూడా ఐసీసీ నిలిపివేయాలి.  అంతర్జాతీయ స్థాయిలో జట్టును నడిపించే కెప్టెన్ ఉన్నప్పుడు.. కోచ్ అవసరం లేదు'అని అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నాడు. 1999 నుంచి 2014 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పలువురు విదేశీ కోచ్లనూ నియమిస్తూనే వచ్చింది. అయినా ఫలితం శూన్యం. 1992 వరల్డ్ కప్తో పాటు 2009 లో వరల్డ్ టీ 20 టైటిల్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు ఇంతికాబ్ అలామ్ ఇంఛార్జిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా ఖాదిర్ గుర్తు చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdul Qadir  team coach  waste of money  pakistan  pakistan cricket board  

Other Articles