Sri Lankan cricketer Kaushal Silva hospitalized after suffering a blow to head

Kaushal silva airlifted to hospital after suffering blow to head

Kaushal Silva,Kaushal Silva airlifted, Kaushal Silva hit on the head, kaushal silva injured, kaushal silva out of danger, kaushal silva srilanka cricketer, kaushal silva suffered a blow to head

Sri Lanka's test opener Kaushal Silva was taken to hospital on Sunday after being hit on the head by a cricket ball while fielding in a domestic match.

గ్రౌండ్ లో కుప్పకూలిన శ్రీలంక క్రికెటర్.. తప్పిన ప్రాణాపాయం

Posted: 04/25/2016 10:46 AM IST
Kaushal silva airlifted to hospital after suffering blow to head

అస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ 2014 డిసెంబర్ లో దేశవాలి క్రికెట్ అడుతూ బంతి తగిలి గాయపడి పరమపదించినాటి నుంచి క్రికెటర్లను ఏదో తెలియని శాపం వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఘటన తరువాత లీగ్ ధశ క్రికెటర్ల నుంచి జాతీయస్థాయి క్రికెటర్ల వరకు ఎందరో క్రికెటర్లు మైదానంలో.. గాయాలపాలై అసువులు బాస్తున్నారు, అత్యుత్తమ నైపుణ్యం కనబర్చిన ఎప్పటికైనా టీమిండియా జట్టులో స్థానం సంపాదించాలనుకున్న పలువురు క్రికెటర్లరు పిన్న వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు, ఇటు దేశంలోనే కాక అటు విదేశాలలో కూడా ఎన్నో అశలను తమ గుండెల నిండా నింపుకున్న క్రికెటర్లు మైదానంలో గాయాలపాలై మరణిస్తున్నారు.

తాజాగా శ్రీలంకకు చెందిన యువ క్రికెటర్ మైదానంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రి పాలయ్యాడు. శ్రీలంక టెస్టు జట్టులోని ఓ పెనర్ కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్లు తీయించారు. అవన్నీ బాగానే ఉన్నాయి గానీ, తదుపరి పరీక్షల కోసం అతడిని రాజధాని కొలంబోకు తరలించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. సిల్వ ఇప్పటివరకు శ్రీలంక జట్టు తరఫున 24 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 1,404 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 31. షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా సిల్వకు బాల్ తగిలిందని టీమ్ మేనేజర్ సేనానాయకే తెలిపారు.

షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా సిల్వకు బాల్ తగిలిందని టీమ్ మేనేజర్ సేనానాయకే తెలిపారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో శ్రీలంక జట్టు పర్యటన ఉండటంతో దానికి సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లోనే సిల్వ గాయపడ్డాడన్నారు. శ్రీలంక జట్టు వైస్‌ కెప్టెన్ దినేష్ చండీమల్ వెంటనే కౌశల్ తల వెనక వైపునకు పరుగెత్తి, దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించినా, అప్పటికే బాల్ అతడి తలను తాకిందని చెప్పారు. ఫిలిప్ హ్యూస్ మరణానంతరం నుంచి ఆటగాళ్ల భద్రత కోసం అదనపు ప్యాడింగ్‌తో కూడిన హెల్మెట్లను ఉపయోగించడం వల్లే సిల్వకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. కాగా సిల్వకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారని, అయినా అతనికి మరిన్ని పరీక్షలు చేయించేందుకు బోర్డు అనుమతినిచ్చిందని కూడా సేనానాయక్ చెప్పారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka cricketer  kaushal silva  passed away  phil hughes  

Other Articles