Aaqib Javed not interested in Pakistan head coach role, says PCB prefers foreign coach

Former pacer aaqib javed rejects pakistan coach role

Aaqib Javed,PCB,Pakistan coach,Pakistan cricker board, biased selection committee, Former pace bowler Aaqib Javed, United Arab Emirates cricket coach,

Aaqib Javed will not apply for the post of Pakistan head coach since he feels PCB is actually in favour of appointing a foreign coach.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అకిబ్ విమర్శల పర్వం..

Posted: 04/09/2016 11:15 AM IST
Former pacer aaqib javed rejects pakistan coach role

ఆసియ కప్, వర్లడ్ టీ 20 టోర్నీల తరువాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విమర్శల జడివాన కురుస్తుంది, ఓ వైపు మాజీ క్రికెటర్లు పీసీబి తీరుపై, సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో తజాగా వారి జాబితాలోనే చేరాడు ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావెద్. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు క్రికెట్ కోచ్ పదవిని ఇస్తామని హామిని ఇచ్చిందని, ఆ తరువాత తాజాగా మరో నిర్ణయం తీసుకుందని అందుకనే తనకు పాకిస్తాన్ క్రికెట్ కోచ్గా చేసే ఉద్దేశం లేదంటూ  ఆకిబ్ జావెద్ స్పష్టం చేశాడు.

ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి  వచ్చిన ఆఫర్ను ఆకిబ్ తిరస్కరించాడు.  ప్రస్తుతం యూఏఈ (యునైటెట్ అరబ్ ఎమిరేట్స్)కోచ్ గా ఉన్న తాను పాక్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనుకోవడం లేదన్నాడు.గత వారం పాక్ జట్టు కోచ్ పదవిపై తన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పీసీబీ తనను కలిసింది. అయితే వారి విన్నపాన్ని తోసిపుచ్చాను. ప్రస్తుతం యూఏఈ ప్రధాన కోచ్ గా ఉన్నా.  ఒక విదేశీ కోచ్ ను నియమించేందుకు పీసీబీ సన్నాహం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాక్ కోచ్ పదవికి ఎటువంటి దరఖాస్తు చేసుకోవాలనుకోవడం లేదు. యూఏఈ జట్టును విడిచి ఎక్కడికి వెళ్లాలనుకోవడం లేదు'అని జావెద్ తాజాగా పేర్కొన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aaqib Javed  pakistan  cricket coach  PCB  

Other Articles