Vinod Kambli says he is keen on becoming Pakistan's next batting coach

Vinod kambli says he is keen on becoming pakistan s next batting coach

Vinod Kambli, pakistan, Pakistan cricket Board, Vindo Kamli as Pak Coach

Former Indian cricketer Vinod Kambli has expressed his desire to become Pakistan's next batting coach. Soon after Waqar Younis stepped down as the head coach of the Pakistani team, Kambli told a Pakistani news channel that if PCB wants, he is available for the coach's job.

పాక్ కోచ్ గా వినోద్ కాంబ్లే..!

Posted: 04/08/2016 12:42 PM IST
Vinod kambli says he is keen on becoming pakistan s next batting coach

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ.. పొరుగు దేశం పాకిస్థాన్ వెళ్లేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. అవకాశమిస్తే, అంగీకరిస్తే నేను మీ దేశం వచ్చేయడానికి రెడీ అంటున్నాడు. వినోద్ కాంబ్లీ ఏంటి పాక్ వెళ్లాలని కోరుకోవడం ఏంటి అంటారా? వివరాల్లోకి వెళితే.. దిక్కూ, దివానం లేకుండా అనాథలా మారిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి చీఫ్ కోచ్ గా పని చేసేందుకు తాను సిద్ధమని వినోద్ కాంబ్లీ అంటున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పర్మిషన్ ఇస్తే.. కోచ్ బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నాడు.

ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి షాహిద్ అఫ్రిది, చీఫ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ సైడ్ అయ్యారు. తర్వాత ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ గా సర్ఫరాజ్ అహ్మద్ ఎంపిక కాగా, కోచ్ పదవిని చేపట్టేందుకు మాత్రం ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. దీంతో తమ జట్టుకు చీఫ్ కోచ్ కావాలంటూ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనకు ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఏ మేరకు స్పందించారో తెలియదు కాని... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మాత్రం అమితాసక్తి చూపాడు. ఈ మేరకు కాంబ్లీ.. పాకిస్థాన్ కు చెందిన మహిళా జర్నలిస్ట్ అస్మా సిరాజీకి ట్విట్టర్ లో తన ఆసక్తిని తెలుపుతూ ట్వీట్లు పంపాడు. పాక్ క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా పనిచేసేందుకు నేను రెడీ అని ఆ సందేశంలో తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinod Kambli  pakistan  Pakistan cricket Board  Vindo Kamli as Pak Coach  

Other Articles