Sachin Tendulkar had told me that I would play for India soon: Hardik Pandya

Hardik pandya wants to be india s jacques kallis

2016 T20 World Cup, cricket, Hardik Pandya, sachin tendulkar, South Africa, Jacques Kallis. t20 world cup 2016, Team India, Ashish Nehra,

Young Indian all-rounder Hardik Pandya said he wanted to become a world-class all-rounder like South Africa's Jacques Kallis.

ఇండియా జాక్వస్ కలిస్ గా ఎదగాలని వుంది

Posted: 03/09/2016 06:54 PM IST
Hardik pandya wants to be india s jacques kallis

టీమిండియా యువ ఆలౌరౌండర్ హార్టిక్ పాండ్య తన మనసులో మాటను బయటపెట్టాడు. తనకు సౌతాఫ్రికా ఆలౌరౌండర్ కలిస్ లా ఎదగాలని ఉందని అన్నాడు. తొలుత పేస్ బౌలర్ గా జట్టులోకి అడుపెట్టిన కలిస్ .. కాలక్రమంలో బ్యాట్స్ మెన్ గా అవతారమెత్తి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ గా ఎదిగాడు. తను కూడా అలాంటి ఆలౌరౌండర్ గా గుర్తింపు పొందాలని హార్టిక్ పాండ్య బావిస్తున్నాడు. టీమిండియా ఇప్పటి వరకు ఏమైన కొరత ఉందంటే అది ఒక్క ఆలౌరౌండర్ అని చెప్పాలి. పాండ్య ఆ లోటు తీరుస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

టీమిండియా జట్టులో నువ్వు సభ్యుడిగా మారతావని గతేడాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనతో చెప్పాడని గుజరాత్ యువ సంచలనం హార్థిక్ పాండ్యా చెప్పాడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్నప్పుడు సచిన్ తనతో ఈ మాట చెప్పారని పేర్కొన్నాడు. వచ్చే 12 నెలల్లో భారత జట్టుకు ఎంపిక అవుతావని తనలో స్ఫూర్తిని పెంచారని సచిన్ గురించి చెప్పుకొచ్చాడు యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పటేల్. సచిన్ చెప్పిన కేవలం 7 నెలల తర్వాత తాను భారత్ తరఫున మ్యాచ్ లకు ఎంపిక అయ్యానంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. అశీష్ నెహ్రా నేతృత్వంలో బౌలింగ్ చేయడం తనకు కలిసొచ్చిందని, కావాల్సినప్పుడల్లా ఆశూ భాయ్ సలహాలు అడుగుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.

నువ్వు అనుకున్న దానికంటే కూడా మెరుగ్గా బౌలింగ్ చేయలవని తనని ప్రోత్సహించాడని చెప్పాడు. అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాను. ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాను అన్నాడు. తాను ఆల్ రౌండర్ అని, దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలిస్ తరహాలో గొప్ప ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు హార్ధిక్ పాండ్యా వివరించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Hardik Pandya  Team India  Ashish Nehra  

Other Articles