దాయాది దేశాల మధ్య సుమారుగా ఏడాది తరువాత జరుగుతున్న క్రికెట్ పోరులో పాకిస్థాన్ ఆటగాళ్లను చిత్తుచేసి గెలిచింది టీమిండియా. ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరినీ ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్ లో చివరకు ధోని సేన నిలదోక్కుకుని ఆడటంతో పాకిస్థాన్ పై ఐదు విక్కెట్ల తేడాతో గెలిచారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. టీమిండియా ముందు 84 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ స్కోరు ఇప్పటి వరకు నాల్గవ అత్యల్ప స్కోరుగా కూడా నమోదయ్యింది. అయితే పాకిస్థాన్ నిర్ధేశించిన టార్గెట్ ను చేధించడానికి టీమిండియా కొంత నిధానంగానే చేధించింది.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధం తరువాత ఆసియాకప్‌తో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి బరిలో దిగిన అమిర్ బౌలింగ్ లో తన సత్తా చాటాడు. తాను విసిరిన తొలి ఓవర్ లోనే టీమిండియా రెండు విక్కెట్లను కోల్పోయింది. టీమీండియా తొలి ఓవర్ లోనే రెండు విక్కెట్లను కోల్పోవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ తాను ఎదుర్కోన్న రెండో బంతికి ఎల్బీడబ్యూగా వెనుదిరగగా, అదే ఓవర్ లో అమిర్ బంతిని ఎదుర్కోన్న అజింక్య రహానే కూడా ఎల్బీడబ్యూగా వెనుదిరగడంతో టీమిండియాలో కలవరం మెదలైంది.
అ తరువాత రోహిత్, సురేష్ రైనా కాసింత రాణిస్తున్నారన్న తరుణంలో రైనా కూడా తన విక్కట్ ను కోల్పోయాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన యువరాజ్ కాసింత దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలవగాఇద్దరు కలసి భారత్ స్కోరుబోర్డును పరిగెత్తించారు. కోహ్లీ సరిగ్గా అర్థ సెంచరీకి ముందు విక్కెట్ కోల్పోయాడు. సరిగ్గా 49 పరుగల వద్ద మహమ్మద్ సమీ వేసిన బంతికి ఎల్బీ కాకపోయినా అంపైర్ ఔట్ గా పరిగణించడంతో ఆయన వెనుదిరిగాడు. ఇక కేవలం 8 పరుగుల కావాల్సిన సమయంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ దోని తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించి టీమిండియాకు విజాయాన్ని అందించాడు. యువరాజ్ సింగ్ 14 పరుగలతో అజేయంగావున్నాడు. పాకిస్థాన్ కు చెందిన అమిర్ కు మూడు విక్కెట్లు లభించగా, మహమ్మద్ సమీకి రెండు విక్కట్లు లభించాయి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండెకెల స్కోరును సాధించడానికే నానా తంటాలు పడింది. భారత్ పదునైన బౌలింగ్‌కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందు పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కట్టడి చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్ అందుకు తగ్గట్టునే రాణించింది. కేవలం 17.3 ఓవర్లలో 83 పరుగులకే పాక్ ను కూల్చేసింది.
పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్‌లకు తలో వికెట్ లభించింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more